Bandi Sanjay : పరీక్షలు కూడా నిర్వహించడం రాదా? ఇది చేతగాని అసమర్థ ప్రభుత్వం, ట్విట్టర్ టిల్లు అంటూ బండి సంజయ్ నిప్పులు

టీఎస్ పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకేజీతోనే లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. Bandi Sanjay - TET Exam

Bandi Sanjay : పరీక్షలు కూడా నిర్వహించడం రాదా? ఇది చేతగాని అసమర్థ ప్రభుత్వం, ట్విట్టర్ టిల్లు అంటూ బండి సంజయ్ నిప్పులు

Bandi Sanjay - TET Exam (Photo : Google)

Bandi Sanjay – TET Exam : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇది పరీక్షలు నిర్వహించడం చేతగాని సర్కార్ అని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

”సిరిసిల్లలో టెట్ ప్రశ్నాపత్రం తప్పిదాలపై ట్విట్టర్ టిల్లు స్పందించరా? బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీఎస్ పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకేజీతోనే లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు టెట్ ప్రశ్నాపత్రం మార్పు పేరుతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నిత్యం ప్రతిపక్షాలపై బురద చల్లుతూ రాజకీయ పబ్బం గడుపుకునే ట్విట్టర్ టిల్లు. సొంత జిల్లాలో అధికారులు చేసిన నిర్వాకంపై ఎందుకు నోరు మెదపడం లేదు? తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేయాలి” అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Also Read..KVP: కేవీపీపై రేవంత్‌రెడ్డికి కోపమెందుకు.. బీఆర్ఎస్‌కు వచ్చిన ఇబ్బందేంటి?

సిరిసిల్లలో టెట్ పరీక్ష నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. టెట్ పరీక్షలో అధికారుల నిర్లక్ష్యంతో ఒక పేపర్ కు బదులు మరో పేపర్ ఇవ్వడం వల్ల గందరగోళం ఏర్పడింది. మ్యాథ్స్, సైన్స్ పేపర్ కు బదులు ఎన్విరాన్ మెంట్ పేపర్ ను అభ్యర్థులకు ఇన్విజిలేటర్లు ఇచ్చారు. అభ్యర్థులు సమాధానాలను దిద్దడంలో మునిగిపోయారు. అయితే, సుమారు 40 నిమిషాల తర్వాత అధికారులు తప్పుని గుర్తించారు. వెంటనే అభ్యర్థులకు మ్యాథ్స్, సైన్స్ పేపర్ ఇచ్చారు. దాంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

Also Read..TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?