Weather Updates: ఉరుములు, మెరుపులతో వర్షాలు.. జరభద్రం.. ఎల్లో అలర్ట్ ఎప్పటివరకంటే?

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Weather Updates: ఉరుములు, మెరుపులతో వర్షాలు.. జరభద్రం.. ఎల్లో అలర్ట్ ఎప్పటివరకంటే?

Heavy Rains Alert

Updated On : October 10, 2025 / 3:51 PM IST

Weather Updates: తెలంగాణలో ఈనెల 14 వరకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది.

Also Read: ట్రంప్‌ ఆశలు ఆవిరి.. టాటా బైబై ఖతం.. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ “నోబెల్‌” ఎందుకు రాలేదంటే?

ఏపీలోనూ వర్షాలు

ఏపీ వ్యాప్తంగానూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అల్లూరి, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడి వర్షాలు కురుస్తాయని చెప్పింది.

ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడవద్దని తెలిపింది. ఏపీలోని మిగతా జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.