Medchal : పెళ్లైన ఆరు నెలలకే.. ఉరేసుకుని యువ దంపతులు ఆత్మహత్య
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

young couple
young couple : మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మద్ గూడ రాజీవ్ గృహ కల్పలో యువ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
మృతులు అంజి(25), వైష్ణవి(22)గా గుర్తించారు. వీరికి ఆరు నెలల క్రితమే పెళ్లి జరిగింది. అయితే అంతలోనే యువ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.