YS Sharmila: కాంగ్రెస్‎లో సమర్థవంతమైన నేతలు ఎందరో ఉన్నారు: వైఎస్ షర్మిల

రాష్ట్రంలో విడుదలయిన ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు నిజం కావాలని కోరుకుంటున్నా. బీఆర్​ఎస్​ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ఇంటికి పోయే టైం వచ్చింది.

YS Sharmila: కాంగ్రెస్‎లో సమర్థవంతమైన నేతలు ఎందరో ఉన్నారు: వైఎస్ షర్మిల

YS Sharmila Telangana Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైెఎస్ షర్మిలా.. ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన నాయకులు ఉన్నారని అని ఆమె అన్నారు. ఉత్తమ్, భట్టి లాంటి క్రమశిక్షణ గల నేతలు చాలా మంది ఉన్నారని, అయితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు.

‘‘ప్రభుత్వం మారాలి, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కాకూడదనే ఏకైక లక్ష్యంతో ఎన్నికల పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాము. గత రెండు పర్యాయాల్లో మొత్తం 45 మంది ప్రజాప్రతినిధుల్ని కేసీఆర్ కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి సమర్థులు చాలా మంది ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్మీలో పని చేశారు. భట్టి విక్రమార్క దళిత వ్యక్తి, పాదయాత్ర చేశారు’’ అని షర్మిల అన్నారు.


బై బై​ కేసీఆర్.. బహుమతిగా సూట్‌కేసు
షర్మిల తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ‘‘రాష్ట్రంలో విడుదలయిన ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు నిజం కావాలని కోరుకుంటున్నా. బీఆర్​ఎస్​ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ఇంటికి పోయే టైం వచ్చింది. తెలంగాణ ప్రజలు ‘బై బై​ కేసీఆర్’​ అని చెబుతున్నారు. అందుకే ఓ సూట్‌కేసును కేసీఆర్ కు బహుమతిగా ఇస్తున్నాం. ఎన్నికల్లో మేము పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ ను సులభంగా ఓడించగలం కానీ తమ ఉద్దేశం కేసీఆర్ ను అధికారంలో నుంచి దించడమని.. అందువల్లే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాం’’ అని రాసుకొచ్చారు.