Sharmila New Party : లోటస్ పాండ్‌లో షర్మిల కీలక సమావేశం.. ఎప్పుడంటే?
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావానికి సంబంధించి లోటస్ పాండ్ లో జూన్ 9న (బుధవారం) విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి 33 జిల్లాల పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

Sharmila New Party
YS Sharmila New Party : తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావానికి సంబంధించి లోటస్ పాండ్ లో జూన్ 9న (బుధవారం) విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి 33 జిల్లాల పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు లోటస్ పాండ్ లో ముఖ్య నేతలతో ఈ కీలక సమావేశం జరగనుంది.
జూలై 8న పార్టీ ఆవిర్భావరంతో పాటు పార్టీ బలోపేతం, పార్టీలో చేరికలు, పాదయాత్ర వంటి అంశాలపై పార్టీ క్యాడర్ కి వైఎస్ షర్మిల దిశానిర్దేశం చేయనున్నారు. ఇదివరకే అన్ని జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించారు షర్మిల.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్ట్రేషన్ కూడా అయింది. వచ్చే నెలలో పార్టీ జెండా, అజెండాను కూడా వైఎస్ షర్మిల ప్రకటించనున్నారు. ఖమ్మం వేదికగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన షర్మిల.. పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు.