YS Sharmila New Party : వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరు ఇదే..!
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు ముందడుగు పడింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ రిజిస్టర్ అయింది.

Ys Sharmila New Party
YS Sharmila New Party YSR Telangana : తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు ముందడుగు పడింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ రిజిస్టర్ అయింది. తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి ఆమె ముఖ్య అనుచరుడు వాడుక రాజగోపాల్ కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ చేయించారు.
వైఎస్ షర్మిల పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీగా నిర్ణయించినట్టుగా సమాచారం. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16 లోపు తెలుపాలని ఓ జాతీయ పత్రికలో ప్రకటన కూడా ఇచ్చింది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటుకు సంబంధించి అన్ని పత్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్ కు షర్మిల ముఖ్య అనుచరుడు సమర్పించారు.