Ys Sharmila: ఇది పూర్తిగా ఎన్నికల స్టంటే.. దక్షిణ తెలంగాణలో వారికి డిపాజిట్లు దక్కవని సర్వేల్లో తేలింది: షర్మిల

మహానేత రాజశేఖర్ రెడ్డి రూ.35 వేల కోట్లతో పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టును కేసీఆర్ కమీషన్ల కోసం రూ.55 వేల కోట్లకు పెంచినా పూర్తి చేయలేకపోయారని అన్నారు. ఎందుకంటే..

Ys Sharmila: ఇది పూర్తిగా ఎన్నికల స్టంటే.. దక్షిణ తెలంగాణలో వారికి డిపాజిట్లు దక్కవని సర్వేల్లో తేలింది: షర్మిల

YS Sharmila

Updated On : September 7, 2023 / 5:03 PM IST

Ys Sharmila – YSRTP: తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR)పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల వేళ.. పిట్టల దొర వింతలు అన్నీఇన్నీ కావంటూ ఆమె ట్వీట్ చేశారు. ఎన్నికల స్టంట్లు చేస్తున్నారని, దక్షిణ తెలంగాణలో డిపాజిట్లు దక్కవని సర్వేల్లో తేలడంతో భయం పట్టుకుందని అన్నారు.

‘ పాలమూరు ఓట్లు దక్కించుకునేందుకు అగచాట్లు పడుతున్నాడు దొర. సగం పనులే కాని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవాలట! పూర్తేగాని రిజర్వాయర్లకు పూజలట! కాలువలు తవ్వకుండనే ఊరూరా ఉత్సవాలట! స్వరాష్ట్రంలో ప్రారంభించిన తొలి ప్రాజెక్టు పాలమూరు–రంగారెడ్డిని కేసీఆర్ సర్వనాశనం చేశాడు.

రీ డిజైన్ పేరిట తీరని అన్యాయం చేశాడు. కమీషన్లు ఇచ్చే కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయలు కుమ్మరించి, పాలమూరుకు శఠగోపం పెట్టాడు. పనులు ఆగిపోయి పడావుపడ్డ ప్రాజెక్టును.. ఎన్నికల కోసం నామమాత్ర పనులు చేపట్టి, ప్రాజెక్టు మొత్తం పూర్తయిందనే భ్రమను సృష్టిస్తున్నాడు కేసీఆర్. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 50 శాతం కూడా కాలేదు.

ప్రాజెక్టు పరిధిలో ఉన్న 4 రిజర్వాయర్లలో తట్టెడు మట్టీ తీయలేదు. లక్ష్మీదేవిపల్లి 6వ రిజర్వాయర్ అతి గతి లేదు.కేవలం అంజనాపూర్ మొదటి రిజర్వాయర్ లో 90 శాతం పనులే పూర్తి చేసి ప్రాజెక్ట్ మొత్తం కట్టినట్లు కలరింగ్ ఇస్తున్నారు. నార్లాపూర్ వద్ద 9 మోటార్లకు గాను ఒక్కటే వాడుకలోకి తెచ్చారు.

స్థానిక భూనిర్వాసితులకు అణాపైసా సాయం అందలేదు. కాలువలకు భూసేకరణ కూడా పూర్తి కాలేదు. ఇదీ పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చిత్తశుద్ధి. గీసింత పనితనానికి గ్రామాల్లో సంబురాలు చేయాలట! కృష్ణా జలాలు ఊరూరా చల్లాలట. తొమ్మిదేండ్లుగా పాలమూరు ప్రజలను మోసం చేసినందుకు నీ ప్రభుత్వానికి చేయాల్సింది విజయయాత్ర కాదు. పాడెయాత్ర.

పాలమూరు పల్లెల్లో చేయాల్సింది సంబురాలు కాదు. మీ బందిపోట్లకు బడితే పూజలు. మహానేత రాజశేఖర్ రెడ్డి రూ.35 వేల కోట్లతో పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టును కేసీఆర్ కమీషన్ల కోసం రూ.55 వేల కోట్లకు పెంచినా పూర్తి చేయలేకపోయాడు. ఇది పూర్తిగా ఎన్నికల స్టంటే కానీ పాలమూరు మీద ప్రేమ మాత్రం కాదు. దక్షిణ తెలంగాణలో డిపాజిట్లు దక్కవన్న సర్వేలతో.. దొరకు భయం తప్ప.. నీళ్లు ఇవ్వాలన్న సోయి లేదు ‘ అని షర్మిల విమర్శించారు.

Rachamallu Siva Prasad Reddy : కూతురు ప్రేమించిన వ్యక్తితో దగ్గరుండి మరీ పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే, తన కులం కాకపోయినా..