YS Sharmila Party : ఆ రోజున పార్టీ పేరు ప్రకటించనున్న షర్మిల

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పేరు ప్రకటనకు రెడీ అవుతున్నారు. జూలై 8న వై.యస్.ఆర్.టి.పి(YSRTP) లాంఛనంగా ప్రకటించనున్నారు.

YS Sharmila Party : ఆ రోజున పార్టీ పేరు ప్రకటించనున్న షర్మిల

Ys Sharmila Party

Updated On : June 9, 2021 / 1:25 PM IST

YS Sharmila Party : వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పేరు ప్రకటనకు రెడీ అవుతున్నారు. జూలై 8న వై.యస్.ఆర్.టి.పి(YSRTP) లాంఛనంగా ప్రకటించనున్నారు. అదే రోజు 33 జిల్లాల వై.యస్.ఆర్ అభిమానులతో సమావేశం కానున్నారు. కొత్త పార్టీ నిర్మాణం కోసం గ్రామీణ, మండల, నియోజకవర్గ స్థాయిలో హడక్ కమిటీలు వేయనున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఏర్పాట్లపై చర్చిస్తారు. అభిమానులతో సమావేశం కొవిడ్ నిబంధనల ప్రకారమే జరగనుంది. పార్టీ పేరు ప్రకటన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈ సమావేశంలో అడిగి తెలుసుకోనున్నారు షర్మిల.

షర్మిల పార్టీ ప్రకటన కోసం వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. జూలై 8న దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు. అదే రోజు పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తెలంగాణలో మళ్ళీ తీసుకురావడం కోసం, వైఎస్ ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా, వైఎస్ అందించిన సంక్షేమం .. ప్రతి ఇంటికి మళ్ళీ చేరేలా “YSR తెలంగాణ” పార్టీ పెట్టాలనుకుంటున్నట్లు షర్మిల ఇప్పటికే తెలిపారు. YSR తెలంగాణ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పనులన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర పూర్తయ్యాయన్నారు. పార్టీ పేరుపై YS విజయమ్మ ఎటువంటి అభ్యంతరం లేదని వారు ఇచ్చిన లేఖను కూడా పార్టీ పేరుకు మద్దతుగా ఎలక్షన్ కమిషన్ కు ఇవ్వడం జరిగిందన్నారు.