YS Sharmila: వరద బాధితులకు సాయం అందక చస్తుంటే సంబురాలు చేసుకోమంటారా చిన్న దొర?: షర్మిల
వర్షాలకు ఇళ్లు కూలి, వరదల్లో కొట్టుకుపోయి 41 మంది ప్రాణాలు పోతే మీకు సంతోషమా అని కేటీఆర్ ను షర్మిల నిలదీశారు.

YS Sharmila
YS Sharmila – KTR: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, సాయం అందక చస్తుంటే సీఎం కేసీఆర్ (CM KCR) చారిత్రక నిర్ణయాలపై సంబురాలు చేసుకోవాలని చిన్న దొర కేటీఆర్ అంటున్నారని వైఎస్సార్టీపీ (Ysrtp) అధినేత్రి షర్మిల అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆమె ట్వీట్ చేశారు.
వర్షాలకు ఇళ్లు కూలి, వరదల్లో కొట్టుకుపోయి 41 మంది ప్రాణాలు పోతే మీకు సంతోషమా అని కేటీఆర్ ను షర్మిల నిలదీశారు. పంటలు మునిగి రైతులు కన్నీరు పెడుతుంటే మీకు సంబరమా అని ప్రశ్నించారు. రైతన్నలకు రూ.2 వేల కోట్ల నష్టం జరిగితే మీకు సంబరమా? అని అన్నారు. సిగ్గు లేకుండా వరద బాధితులకు రూ.10 వేలు ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్‌దని షర్మిల చెప్పారు.
పంట పరిహారం ఇవ్వకుండా, పంట బీమా ఇవ్వకుండా నిండా ముంచిన హిస్టరీ కేసీఆర్ కి ఉందని షర్మిల విమర్శించారు. దిక్కుమాలిన నిర్ణయాలకు, దగాకోరు పాలనకు, మోసపూరిత హామీలకు కేసీఆర్ కు చేయాల్సింది సంబురాలు కాదు బడితపూజ అని అన్నారు. సంబరాలు చేసుకుంటుంది తెలంగాణ ప్రజలు కాదని, కేసీఆర్ కుటుంబం మాత్రమేనని చెప్పారు.
షర్మిల ప్రశ్నలు
చారిత్రక నిర్ణయాలు అంటే ఏంటి?
మీ అయ్య రుణమాఫీ చేయకపోవడమా?
నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడమా?
డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకపోవడమా?
ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోవడమా?
క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవడమా?
104 సేవలను ఎత్తేయడమా?
రూ.4 లక్షల కోట్లు పంది కొక్కుల్లా పీక్కుతినడమా?
Jayasudha: బీజేపీలో చేరిన జయసుధ.. ఆ తర్వాత ఆసక్తికర కామెంట్స్..