Yuva Telangana Party: బీజేపీలో విలీనమైన యువ తెలంగాణ పార్టీ

జిట్టా బాలకృష్ణా రెడ్డి సారధ్యంలోని యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీనం అయ్యింది.

Yuva Telangana Party: బీజేపీలో విలీనమైన యువ తెలంగాణ పార్టీ

Telangana

Updated On : February 16, 2022 / 12:49 PM IST

Yuva Telangana Party: జిట్టా బాలకృష్ణా రెడ్డి సారధ్యంలోని యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీనం అయ్యింది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో పార్టీ విలీనం అయ్యింది.

యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ సహా పలువురు నాయకులు పార్టీ విలీన కార్యక్రమంలో పాల్గొన్నారు. విలీనం అనంతరం జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌ని గద్దె దించడానికే బీజేపీలో యువ తెలంగాణ పార్టీని విలీనం చేశామని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన ఏవిధంగా ఉందో? దేశంలో మోదీ పాలన ఎలా ఉందో? ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

గత 15రోజులుగా కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా యువతెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశామని, పార్టీ కోసం పనిచేస్తామని అన్నారు. కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఇంకా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ యువత బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.