BTech Pani Puri Wali : బుల్లెట్‌పై దూసుకొచ్చే బీటెక్ పానీ పూరీ వాలీ..

21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్.. బీటెక్ పానీపూరి వాలీగా పేరొందారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బండికి ఏర్పాటు చేసుకున్న చిన్న బండిపై తాప్పీ పానీపూరీలను అమ్ముతున్నారు. బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కంటే పానీపూరీ వ్యాపారం చేయటమే ఇష్టంగా చేసుకున్నారామె. ఢిల్లీలోని తిలక్ నగర్ లో తాప్సీ పానీపూరీలు అమ్ముతున్నారు

BTech Pani Puri Wali : బుల్లెట్‌పై దూసుకొచ్చే బీటెక్ పానీ పూరీ వాలీ..

21 year old BTech pani puri wali who is on a mission to serve healthier street food

Updated On : March 9, 2023 / 8:23 PM IST

BTech Pani Puri Wali : చదివింది బీటెక్. అమ్మేది పానీపూరీలు. పైగా రాయల్ ఎన్ ఫీల్డ్ పై దూసుకొచ్చి మరీ పానీపూరీలు అమ్మితే ఎలా ఉంటుంది?ఇదిగో ఇలా ఉంటుంది అనేలా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ అందమైన అమ్మాయి రాయల్ ఎన్ ఫీల్డ్ నడుపుతు వచ్చి పానీపూరీలు అమ్ముతుంటే మరి ఇంకెంత ఆశ్చర్యంగా ఉంటుందో కదా..పానీపూరీ అంటే ఇష్టపడనివారు ఉండరు. అటువంటి పానీపూరీని ఓ అందమైన యువతి అమ్మితే..పైగా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ దర్జాగా వచ్చి పానీపూరీలు అమ్మితే..అది వైరల్ అవ్వకుండా ఎలా ఉంటుంది? అయ్యే తీరుతుంది ఇదిగో ఇలా..

Manish Sisodia-Delhi liquor Scam: మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ

21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్.. బీటెక్ పానీపూరి వాలీగా పేరొందారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బండికి ఏర్పాటు చేసుకున్న చిన్న బండిపై తాప్పీ పానీపూరీలను అమ్ముతున్నారు. బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కంటే పానీపూరీ వ్యాపారం చేయటమే ఇష్టంగా చేసుకున్నారామె. ఢిల్లీలోని తిలక్ నగర్ లో తాప్సీ పానీపూరీలు అమ్ముతున్నారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతోనే తాను ఈ వ్యాపారాన్ని ప్రారంభినట్లు తాప్సీ చెబుతున్నారు. సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పానీలో పూరీని ముంచి ఇస్తున్న తాప్సీ పానీపూరీలకు జనాలు ఫిదా అయిపోతున్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ పానీపూరీ వాలీపై వ్యూస్ వాన కురిపిస్తున్నారు.