Bengaluru airport : కర్ణాటక బంద్ సందర్భంగా 44 విమానాల రద్దు

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కర్ణాటక బంద్ సందర్భంగా 44 విమానాలను రద్దు చేశారు. పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం 44 విమానాలు రద్దు చేశారు....

Bengaluru airport : కర్ణాటక బంద్ సందర్భంగా 44 విమానాల రద్దు

Bengaluru airport

Bengaluru airport : బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కర్ణాటక బంద్ సందర్భంగా 44 విమానాలను రద్దు చేశారు. పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం 44 విమానాలు రద్దు చేశారు. (44 flights cancelled) బంద్ విజయవంతం కావడంతో విమాన సర్వీసులను రద్దు చేసి విమాన ప్రయాణికులకు సమాచారం అందించామని బెంగళూరు విమానాశ్రయ అధికారులు చెప్పారు.

Khalistani separatist : ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ నిజ్జర్ హత్యపై కెనడా పోలీసుల విచారణ

కర్ణాటక బంద్ ప్రభావంతో చాలా మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఐదుగురు కన్నడ అనుకూల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నగరంలోని టౌన్ హాల్ నుంచి ఫ్రీడం పార్క్ వరకు భారీ నిరసన ప్రదర్శన జరిపారు.

Uttar Pradesh : కూతురు పెళ్లి కోసం బ్యాంకు లాకర్‌లో ఉంచిన రూ.18 లక్షలకు పట్టిన చెదపురుగులు

ఈ ప్రదర్శనలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. బంద్ సందర్భంగా జాతీయ రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రైళ్ల రాకపోకల్లోనూ అంతరాయం వాటిల్లింది. శుక్రవారం నాటి కర్ణాటక బంద్ విజయవంతమైందని బంద్ నిర్వాహకులు చెప్పారు.