Sanju Samson : టీ20 సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు సంజూ శాంసన్ వార్నింగ్!
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో దుమ్ములేపుతున్నాడు.
Big warning to South Africa ahead of t20 series Sanju Samson in full form
Sanju Samson : టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో దుమ్ములేపుతున్నాడు. మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో 41 బంతుల్లోనే 51 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇక రెండో మ్యాచ్‌లో 15 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. ఇక గురువారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 8 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 46 పరుగులు సాధించాడు. కాగా.. ఈ టోర్నీలో శాంసన్ ఓపెనర్‌గానే ఆడుతుండడం గమనార్హం.
గిల్ దూరం అయితే..
దక్షిణాఫ్రికాతో భారత్ డిసెంబర్ 9 నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఇందులో సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. వికెట్ కీపర్ జాబితాలో శాంసన్‌తో పాటు జితేశ్ కుమార్ ఎంపిక అయ్యాడు.
మొన్నటి వరకు భారత టీ20 జట్టులో రెగ్యులర్ ఓపెనర్ అయిన సంజూ శాంసన్.. శుభ్‌మన్ గిల్ రీ ఎంట్రీతో మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. అయితే.. ఇక్కడ అతడు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ సైతం ఎంపిక అయ్యాడు. అయితే.. అతడు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తేనే ఆడతాడని బీసీసీఐ తెలిపింది. ఒకవేళ గిల్ ఫిట్‌నెస్ సాధించకపోతే అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. గిల్ ఫిట్‌నెస్ సాధిస్తే.. వికెట్ కీపర్ స్థానం కోసం జితేశ్ శర్మతో అతడు పోటీపడాల్సి ఉంటుంది.
దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హర్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.
Virat Kohli : కోహ్లీ వన్డేల్లో 53 సెంచరీలు చేస్తే.. ఎన్ని మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయిందో తెలుసా?
టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 మ్యాచ్ – డిసెంబర్ 9న (కటక్)
* రెండో టీ20 మ్యాచ్ – డిసెంబర్ 11న (ఛండీగర్)
* మూడో టీ20 మ్యాచ్ – డిసెంబర్ 14న (ధర్మశాల)
* నాలుగో టీ20 మ్యాచ్ – డిసెంబర్ 17న (లక్నో)
* ఐదో టీ20 మ్యాచ్ – డిసెంబర్ 19న (అహ్మదాబాద్)
