Fact check: రేనాల్డ్స్ పెన్నులు ఇక కనపడవా? నిజమేంటో తెలుసా?
ఓ తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నామంటూ రేనాల్డ్స్ ఓ ప్రకటన చేసింది.

Reynolds
Fact check – Reynolds: రేనాల్డ్స్ పెన్నులు ఇక కనపడవంటూ సామాజిక మాధ్యమాల్లో, పలు వెబ్‌సైట్లలో రెండు రోజులుగా అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది. 1990-2000 సంవత్సరాల మధ్య బడుల్లో చదువుకున్న వారికి రేనాల్డ్స్ పెన్నులంటే చాలా ఇష్టం.
ఆ పెన్నులతోనే పరీక్షలు రాసి పాసయ్యమంటూ 90s కిడ్స్ ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే, రేనాల్డ్స్ 045 బాల్ పెన్ చివరి స్టాక్ అమెజాన్ లో ఉందని, అది అయిపోయాక ఇక ఆ పెన్నులు కనపడవని, ఆ కంపెనీ కొత్త పెన్నులను తయారు చేయబోదని ప్రచారం జరుగుతోంది.
దీంతో ఆ పెన్నుల అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. ఆ పెన్నులతో పెనవేసుకున్న తమ అనుబంధాన్ని తెలుపుతూ తెగ పోస్టులు చేస్తున్నారు. ఈ పెన్నులేకపోతే తాము లేమన్నట్లు ఫీలైపోతున్నారు.
దీనిపై రేనాల్డ్స్ సంస్థ స్పష్టతనిస్తూ ఓ ప్రకటన చేసింది. ” ఓ తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాం. ఆ సమాచారంలో నిజం లేదు. మా సంస్థకు సంబంధించిన కచ్చితమైన, నిజమైన సమాచారం కోసం మా అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ఛానెళ్లను మాత్రమే చూడాలని మా భాగస్వాములు, వాటాదారులు, కస్టమర్లకు సూచిస్తున్నాం. మాపై ఉన్న మీ నమ్మకాన్ని నిలుపుకోవడానికే మేము తొలి ప్రాధాన్యం ఇస్తాం ” అని తెలిపింది.
మీడియాలో తప్పుడు సమాచారం వస్తోందని, భారత్ లో తమ సంస్థ 45 ఏళ్లుగా ఉందని, నాణ్యతకు, ఆవిష్కరణలకు ప్రాధానం ఇస్తోందని గుర్తుచేసుకుంది. అంతేగాక, భవిష్యత్తులో తమ బిజినెస్ ను మరింత విస్తరించాలనుకుంటున్నామని పేర్కొంది.
View this post on Instagram
Reynolds 045 Fine Carbure will no longer be available in market, end of an era..💔 pic.twitter.com/pSU4WoB5gt
— 90skid (@memorable_90s) August 24, 2023