10 ఏళ్ల పాప.. 21 లక్షల మంది ఫాలోయర్లు.. ఆ ఇంగ్లిష్.. ఆ కాన్ఫిడెన్స్.. వావ్..
"వివేషస్ వరెన్యా" అనే పేరుతో సోషల్ మీడియాలో వరెన్యా బోర్బోరా పాపులర్ అయింది. తాజాగా 'ది రణవీర్ షో'లో షోలో పాల్గొని.. ఆమె ధైర్యంగా మాట్లాడిన తీరు, ఇంగ్లిష్ ఉచ్చారణ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.

ఆ పాప పేరు వరెన్యా బోర్బోరా. వయసు 10 ఏళ్లు మాత్రమే. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 21 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆమె ఇంగ్లిష్ మాట్లాడే తీరు, ఆ కాన్ఫిడెన్స్ చూస్తే ఎవ్వరైనా సరే వావ్ అనాల్సిందే. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఫాలో చేయాల్సిందే. తన మాటల తీరుతో, ఆత్మవిశ్వాసంతో ఈ బాలిక సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వరెన్యా బోర్బోరా అసోం రాష్ట్రం జోర్‌హాట్‌కు చెందిన బాలిక. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వరెన్యా ఇన్‌స్టాగ్రామ్‌ను ఆమె తల్లి మసుమి శర్మ బోర్బోరా నిర్వహిస్తున్నారు. స్పష్టంగా మాట్లాడే వరెన్యా తీరు, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అభివ్యక్తి ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. వ్లాగ్స్, ఎడ్యుకేషనల్ వీడియోలు ఆమె కంటెంట్‌లో కనిపిస్తుంటాయి.
బీర్‌బైసెప్స్‌గా పాపులర్ అయిన రణవీర్ అలహాబాద్‌యా సెలబ్రిటీలు, పొలిటిషియన్లు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తుంటాడు. రీసెంట్‌గా ‘ది రణవీర్ షో’లో వరెన్యా బోర్బోరాను ఇంటర్వ్యూ చేశాడు. ఆమెకు ఉన్న భారీ ఫాలోయింగ్ పై రణవీర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
“వివేషస్ వరెన్యా” అనే పేరుతో సోషల్ మీడియాలో వరెన్యా బోర్బోరా పాపులర్ అయింది. తాజాగా ‘ది రణవీర్ షో’లో షోలో పాల్గొని.. ఆమె ధైర్యంగా మాట్లాడిన తీరు, ఇంగ్లిష్ ఉచ్చారణ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. “నేను ఇప్పటివరకు కలిసిన మోస్ కాన్ఫిడెంట్ అమ్మాయివి నీవే” అని రణవీర్ చెప్పాడు.
ఆ సమయంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ గురించి చెప్పినప్పుడు ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు 1.9 మిలియన్‌ల ఫాలోయర్లు ఉన్నారని ఆ బాలిక తెలిపింది. ఇప్పుడు ఆ ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగి 2.1 మిలియన్లకు చేరింది.
“పిల్లలు హోంవర్క్‌తో బిజీగా ఉండే వయసులో, ఈమె ఇంటర్నెట్‌లో తనదైన ముద్ర వేసింది. ఆమె ధైర్యం, క్లారిటీ నిన్ను ఇన్‌స్పైర్ చేస్తాయి” అని ‘ది రణవీర్ షో’ ఖాతాలో పేర్కొన్నారు.
View this post on Instagram