Minister Peddireddy : వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు..
కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Minister Peddireddy Ramachandra Reddy
AP Politics : వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇంకనుంచి ఏపీ రాజకీయాల్లో షర్మిల కీలక భూమిక పోషించనున్నారు. ఆమెకు ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. తాజా పరిణామాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం అన్నారు. సీఎం వైఎస్ జగన్ మా నాయకుడు, ఆయనకోసం మేము ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు ఎన్ని వచ్చినా మేము మా ముఖ్యమంత్రి వెంటే నడుస్తామని అన్నారు.
Also Read : Gorantla Madhav : సజ్జలతో గొడవపడినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన గోరంట్ల మాధవ్.. ఏమన్నారంటే?
కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా.. మా పార్టీకి వ్యతిరేకంగా ఉంటే మేము ప్రత్యర్థిగానే చూస్తామని అన్నారు. జడ్పీటీసీగా గెలవలేని ఎంఎస్ బాబును ఎమ్మెల్యేగా చేశామని, ఎవరో రెచ్చగొట్టే మాటలు విని ఎంఎస్ బాబు మాట్లాడటం బాధాకరమని పెద్దరెడ్డి అన్నారు. ఆయన ఇప్పటికైన ఆత్మవిమర్శ చేసుకొని వైసీపీకోసం పనిచేయాలని పెద్దిరెడ్డి సూచించారు.