Dundigal : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ బౌరంపేటలో శనివారం అర్ధరాత్రి సమయంలో కోకాకోల కంపెనీ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొంది.

Dundigal
Dundigal : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ బౌరంపేటలో శనివారం అర్ధరాత్రి సమయంలో కోకాకోల కంపెనీ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడిక్కకడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. గాయపడిన వ్యక్తి పేరు అశోక్ అని అతడిది ఏలూరని గుర్తించారు పోలీసులు.
చదవండి : Road Accident : విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి
మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని విజవాడకు చెందిన చరణ్, పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుకు చెందిన సంజూ, గణేశ్‌గా గుర్తించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కారులోని వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగం కోసం వచ్చిన వీరు మద్యం సేవించి కారు నడిపి ప్రమాదానికి గురైనట్లు వివరించారు పోలీసులు. ప్రస్తుతం అశోక్ పరిస్థితి విషమంగానే ఉందని, మరికొన్ని గంటలైతే కానీ ఏడైంది చెప్పలేమని వైద్యులు తెలిపారు.
చదవండి : Road Accident : కేరళలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి