Cow Dung : ఆవు పేడతో రాకెట్ ఇంజన్ ప్రయోగం సక్సెస్
సంప్రదాయ రాకెట్ ఇంజన్లతో పోల్చితే లిక్విడ్ బయో మిథేన్ ఆధారిత ఇంజన్ల ఖర్చు చాలా తక్కువని జపాన్ స్పేస్ అధికారులు తెలిపారు.

Rocket Engine Cow Dung
Rocket Engine – Cow Dung : జపాన్ శాస్త్రవేత్తలు ఆవు పేడతో రాకెట్ ఇంజన్ ను విజయంగా నడిపించారు. ఆవు పేడతో తీసిన లిక్విడ్ బయో మీథేన్‌తో జరిపిన పరీక్షలు సక్సెస్ అయ్యాయి. హెకైడో స్పేస్ పోర్టు లాంచ్ కాంప్లెక్స్ లో ఈ పరీక్షలు నిర్వహించారు. సంప్రదాయ రాకెట్ ఇంజన్లతో పోల్చితే లిక్విడ్ బయో మిథేన్ ఆధారిత ఇంజన్ల ఖర్చు చాలా తక్కువని జపాన్ స్పేస్ అధికారులు తెలిపారు.
జపాన్‌లోని ఇంజనీర్లు ఆవు పేడ నుండి సేకరించిన ద్రవ మీథేన్‌తో నడిచే కొత్త రాకెట్ ఇంజిన్‌ను ప్రయత్నించారు. ఇది మరింత స్థిరమైన ప్రొపెల్లెంట్ అభివృద్ధికి దారితీయవచ్చు. జీరోగా పిలువబడే ఈ రాకెట్ ఇంజిన్ జపాన్‌లోని హక్కైడో స్పేస్‌పోర్ట్‌లో 10-సెకన్ల స్టాటిక్ ఫైర్ టెస్ట్”లో కిక్‌స్టార్ట్ చేశారు.
జీరో ఒక చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం అని కంపెనీ తెలిపింది. లిక్విడ్ బయోమీథేన్ లేదా ఎల్బీఎం ద్వారా శక్తిని పొందుతుందన్నారు. ఇది పశువుల ఎరువు నుండి తీసుకున్నట్లు పేర్కొంది. ఇది హక్కైడో డెయిరీ ఫామ్‌ల నుండి తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.