శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌పై రూ.12 వేల డిస్కౌంట్.. కొన్ని రోజుల వరకే ఆఫర్
అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన విషయం తెలిసిందే. దీని ప్రారంభ ధర రూ.1,29,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రాపై ప్రస్తుతం రూ.12,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంతేగాక, అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి.
శాంసంగ్ ప్రస్తుతం తన ఆన్‌లైన్ స్టోర్ ద్వారా గెలాక్సీ S25 అల్ట్రాపై ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ టైటానియం సిల్వర్‌బ్లూ కలర్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే రూ.11,000 ఇన్‌స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ లేదా రూ.12,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. దీంతో ధర రూ.1,17,999కి తగ్గుతుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
యాప్‌లో కొనుగోళ్లపై అదనంగా రూ.4,000 వెల్‌కమ్ బెనిఫిట్స్ పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఆపర్షన్లు రూ.3,278 నుంచి ప్రారంభమవుతాయి. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 75,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
ఫీచర్లు
ఫ్రేమ్: టైటానియం
గ్లాస్: కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2
డైమెన్షన్స్: 162.8 × 77.6 × 8.2 మిమీ
బరువు: 218 గ్రాములు
డిస్ప్లే: 6.9-అంగుళాల డైనమిక్ AMOLED 2X, 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, WQHD+ రిజల్యూషన్ (3,120 × 1,440 పిక్సెల్స్), HDR10+ సపోర్ట్
కలర్ వేరియంట్లు: టైటానియం సిల్వర్ బ్లూ, టైటానియం బ్లాక్, టైటానియం వైట్ సిల్వర్, టైటానియం గ్రే
చిప్‌సెట్: గెలాక్సీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (3nm)
సీపీయూ: ఆక్టా-కోర్ (2×4.47 GHz ఓరియన్ V2 ఫీనిక్స్ L + 6×3.53 GHz Oryon V2 Phoenix M)
RAM: 12GB / 16GB
స్టోరేజ్: 256GB / 512GB / 1TB (UFS 4.0)
ఆపరేటింగ్ సిస్టమ్: One UI 7తో Android 15
బ్యాక్ కెమెరాలు: 200MP వెడల్పు (f/1.7, OIS), 50MP అల్ట్రావైడ్ (f/1.9, 120° FoV), 50MP టెలిఫొటో (f/3.4, 5x ఆప్టికల్ జూమ్, OIS), 10MP పెరిస్కోప్ టెలిఫొటో (f/2.4, 3x ఆప్టికల్ జూమ్, OIS)
ఫ్రంట్ కెమెరా కెమెరా: 12MP (f/2.2)
వీడియో రికార్డింగ్: 30fps వద్ద 8K, 120fps వద్ద 4K
మిగతా ఫీచర్లు: డ్యూయల్ రికార్డింగ్, నైట్ మోడ్, ప్రో వీడియో, సూపర్ స్టెడీ, 100x డిజిటల్ జూమ్
బ్యాటరీ సామర్థ్యం: 5,000mAh
వైర్డ్ ఛార్జింగ్: 45W
వైర్‌లెస్ ఛార్జింగ్: 15W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0
రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్: 10W