Right Order to Eat Your Food : భోజనంలో ముందుగా ఏది తినాలి? ఏది తినకూడదు?
ఇండియాలో ఏ వేడుకలో అయినా భోజనంలో ముందుగా స్పైసీ ఫుడ్ పెడతారు. చివర్లో స్వీట్లు సెర్వ్ చేస్తారు. ఇలా చేయడం సంప్రదాయం మాత్రమే కాదు.. దీని వెనుక కారణాలున్నాయి.

Right Order to Eat Your Food
Right Order to Eat Your Food : ఇంట్లో పెళ్లైనా, పండుగలు అయినా ముందుగా పప్పు, కూరగాయలు, చపాతీ, అన్నం, పచ్చళ్లతో భోజనం తినడం మొదలుపెడతాం. చివర్లో స్వీట్లు, ఐస్ క్రీంతో ముగిస్తాం. ఇది సంప్రదాయం మాత్రమే కాదు ఇలా తినడం వెనుక కూడా ఆరోగ్యం, సైన్స్ ఉన్నాయని మీకు తెలుసా?
ముందుగా స్వీట్స్‌తో ఫుడ్ తినడం మొదలుపెట్టడం మంచిది కాదు. ఎందుకంటే స్వీట్స్‌లో తెల్ల చక్కెర, ప్రిజర్వేటివ్ కలర్స్, కార్బోహైడ్రేట్ లు ఉంటాయి. ఇవి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అదే కారంగా ఉండే పదార్ధాలు తీసుకుంటే జీర్ణ రసం, ఆమ్లాలు విడుదలై జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
After Meal : భోజనం తరువాత చేయకూడని పనులివే
స్వీట్లు జీర్ణక్రియ ప్రక్రియను తగ్గించే కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. అందువల్ల, భోజనాల చివరలో మాత్రమే స్వీట్లు వడ్డిస్తారు. ఎక్కువ మొత్తంలో తెల్ల చక్కెరతో తయారు చేసిన స్వీట్లు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వాటికి బదులుగా ఇంట్లో స్వీట్ చేయాలంటే బెల్లం, తేనె వాడటం మంచిది. ఇక మసాలా అధికరంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఒక్కోసారి కడుపులో ఇబ్బంది కలుగుతుంది. నిజానికి మనం ప్రతి రోజు మనం తినే ఆహారంలో ఆరు రుచులు కంపల్సరీగా తినాలట. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, ఆస్ట్రింజెంట్. ఈ రుచులు ప్రధానంగా మన శరీరంలో జీర్ణమయ్యే రుచుల జాబితాలో ఉన్నాయి.