Viral Video: రెండోసారి పెళ్లి.. వేడుకలో హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిచ్ డ్యాన్స్
హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిచ్ పెళ్లి వేడుకలో తీసుకున్న మరో వీడియో బయటకు వచ్చింది. వధూవరులు ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఇందులో కనపడ్డారు. వారిద్దరు డ్యాన్సు చేస్తూ ముందుకు కదిలారు.

Viral Video
Viral Video: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిన్న టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఆయన భార్య నటాసా స్టాంకోవిచ్ మరోసారి పెళ్లి చేసుకున్న వేళ తీసుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. 2020 మేలో వారి వివాహం కరోనా కారణంగా నిరాడంబరంగా జరిగింది. దీంతో వారు ఈ సారి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా, హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిచ్ పెళ్లి వేడుకలో తీసుకున్న మరో వీడియో బయటకు వచ్చింది. వధూవరులు ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఇందులో కనపడ్డారు. వారిద్దరు డ్యాన్సు చేస్తూ ముందుకు కదిలారు.
కాగా, పెళ్లి జరిగిన అనంతరం హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా తాము మరోసారి పెళ్లి చేసుకన్నామని, తమతో కలిసి ఎంతో ప్రేమగా తమ పెళ్లి వేడుకలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉండడం తమ అదృష్టమని చెప్పాడు.
Some more snippets from Hardik and Natasha’s wedding in Udaipur VC – @__mohitsharmaa #hardikpandya #natashastankovic #wedding #instantbollywood #av pic.twitter.com/jjJE8VlXLi
— KHABAR INFO (@InfoKhabar) February 15, 2023
Baldness : బట్టతల ఉందని ఉద్యోగం నుంచి తీసేసిన బాస్ .. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఉద్యోగి