విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు బ్లాక్‌లో విక్రయం : తిరుమలలో 23 మంది దళారీలు అరెస్ట్

తిరుమలలో 23మంది దళారీలను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు టిటిడి ఉద్యోగులు, ఒక కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నారు.

  • Published By: veegamteam ,Published On : October 21, 2019 / 03:42 PM IST
విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు బ్లాక్‌లో విక్రయం : తిరుమలలో 23 మంది దళారీలు అరెస్ట్

Updated On : October 21, 2019 / 3:42 PM IST

తిరుమలలో 23మంది దళారీలను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు టిటిడి ఉద్యోగులు, ఒక కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నారు.

తిరుమలలో 23మంది దళారీలను అరెస్ట్ చేశారు వన్‌టౌన్‌ పోలీసులు. గూడూరు ఎమ్మెల్యే లెటర్‌పై ఐదుగురికి విఐపి బ్రేక్ దర్శనానికి అనుమతి పొందిన దళారి శ్రీనివాసులు నాయుడు..ఐదు టికెట్లను.. రెండు పార్టీలకు బ్లాక్‌లో విక్రయించాడు. ఈ ఘటనలో శ్రీనివాసులు నాయుడును పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించారు. 

శ్రీనివాసులు నాయుడు ఇచ్చిన సమాచారంతో.. మరో 22 మందిని అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో ఇద్దరు టిటిడి ఉద్యోగులు, ఒక కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నారు. వీరంతా లడ్డూలు, గదులు, దర్శనం టికెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు.