లక్ష రూపాయల లంచంతో దొరికిన పంచాయతీ అధికారి

కీసరలోని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : November 7, 2019 / 11:11 AM IST
లక్ష రూపాయల లంచంతో దొరికిన పంచాయతీ అధికారి

Updated On : November 7, 2019 / 11:11 AM IST

కీసరలోని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

కీసరలోని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  

గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య ఆడిట్ రిపోర్టు క్లియర్ చేయడానికి రవికుమార్ రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఈశ్వరయ్య నుంచి గురువారం (నవంబర్ 7, 2019) లక్ష రూపాయలు తీసుకుంటుండగా రవికుమార్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రవికుమార్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం స్థానికులను నివ్వెరబోయేలా చేసింది.

మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య ఆడిట్ రిపోర్టు క్లియర్ చేయడం కోసం రూ.15 లక్షల రూపాయలలో 5 లక్షల రూపాయలు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఇవాళ పంచాయతీ అధికారి రవికుమార్ కు ఈశ్వరయ్య లక్ష రూపాయలు ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు దాడికి చేశారు. లక్ష రూపాయలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. రవికుమార్ ను అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు.
 
రవికుమార్ లంచాల ద్వారా ఎంతవరకు ఆస్తులు కూడబెట్టారు…అతని దగ్గర ఆస్తులు, నగదు ఎంత మొత్తంలో ఉందని అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.