గుడిసెలో ఉంటున్న వింతంతువుకి సోనూ రాఖీ కానుక..ఇల్లు కట్టిస్తానని హామీ

  • Published By: nagamani ,Published On : August 4, 2020 / 11:08 AM IST
గుడిసెలో ఉంటున్న వింతంతువుకి సోనూ రాఖీ కానుక..ఇల్లు కట్టిస్తానని హామీ

Updated On : August 4, 2020 / 11:30 AM IST

పేదల కోసం కష్టాల్లో ఉన్నవారి కోసం ప్రముఖ నటుడు సోనూసూద్ గొప్ప మనసు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సేవకు మారుపేరుగా నిలుస్తున్న సోనూ ఎంతోమంది కష్టాలను తీరుస్తున్నాడు.కన్నీళ్లను తుడుస్తున్నాడు. కష్టం ఎక్కడుంటే అక్కడ నేనుంటా..మీకోసం నేనున్నానంటూ భరోసానిస్తున్న సోనూ సూద్ మరో పేదింటి యువతికి అన్నగా అండగా నేనున్నానని నిలబడ్డాడు. భర్తను పోగొట్టుకుని చిన్ని బిడ్డతో చిన్న గుడిసెలో జీవితాన్ని వెళ్లదీస్తున్న అత్యంత నిరుపేదరాలైన యువతికి రాఖీ పండుగ కానుకగా ఇల్లు కట్టిస్తానని మాటిచ్చాడు. సోనూ మాట ఇచ్చాడు అంటూ అది వెంటనే జరిగిపోవాల్సిందే. ఏమాత్రం ఆలస్యం చేయడు. మాటైతే ఇచ్చాడు గానీ ఇది జరుగుతుందా ఇలా ఎంతోమందిని చూశాం అనే మాటకు తావేలేదు. సోనూ అంటే అది అక్షరాలా జరిగి తీరుతుంది. అనే భరోసా ఎన్నో ఎన్నెన్నో సందర్భాల్లో నెరవేరింది. మాటలు కాదు చేతలతో తన గొప్ప మనస్సుని చాటుకోవటం ఒక్క సోనూసూద్ కు మాత్రమే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.


అస్సాంలోని జల్‌పాయిగురి ఆసమ్‌లో భర్తను పోగొట్టుకున్న ఓ ఒంటరి మహిళ చిన్న గుడిసెలో తన బిడ్డతో నివసిస్తోంది. కూలీపనులు చేసుకుంటూ బిడ్డను పెంచుకంటూ జీవిస్తోంది. సిమెంట్ సంచులతో చుట్టినట్టు ఉంటుంది ఆమె గుడిసె. గట్టిగా వర్షం, గాలి వస్తే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దీనిని ఓ నెటిజన్ వీడియో తీసి సోనూసూద్‌కు ట్వీట్ చేశాడు..ఈ పేదింటి మహిళను ఆదుకోవాలి సోనూ భయ్యా అని అతను అభ్యర్థించాడు. అంతే..వెంటనే స్పందించాడు సోనూసూద్. ఆ చెల్లికి ఇల్లు కట్టించి ఇస్తానని మాట ఇచ్చాడు.

అస్సాంలోని జల్‌పాయిగురి ఆసమ్‌లో భర్తను పోగొట్టుకున్న ఓ ఒంటరి మహిళ చిన్న గుడిసెలో తన బిడ్డతో నివసిస్తోంది. నిత్యం కూలీపనులు చేసుకుని జీవిస్తోంది. సిమెంట్ సంచులతో చుట్టినట్టు ఉంటుంది ఆ గుడిసె. గట్టిగా వర్షం, గాలి వస్తే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దీనిని ఓ నెటిజన్ వీడియో తీసి సోనూసూద్‌కు ట్వీట్ చేశాడు. ఈ పేదింటి మహిళను ఆదుకోవాలి సోనూ భయ్యా అని అతను అభ్యర్థించాడు. దీనిపై సోనూసూద్ వెంటనే స్పందించాడు. ఆ చెల్లికి ఇల్లు కట్టించి ఇస్తానని మాట ఇచ్చాడు.



వలస కూలీల కష్టాలను ఆదుకోవటంతో సోనూ సహాయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాత తుఫాను బాధితులకు అండగా..ఏపీలో ఓ పేద రైతుకు పొలం దున్నుకోవడానికి ట్రాక్టర్ కొని ఇవ్వటం..హిమాచల్ ప్రదేశ్ లో పిల్లల చదువుకోసం ఆవును అమ్ముకున్న పేద తండ్రికి అండగా..యాదాద్రి భువనగిరి జిల్లాలో ముగ్గురు అనాథ పిల్లలను దత్తత తీసుకోవటం..ఇలా సోనూ చేసిన సహాయాల గురించి పెద్ద లిస్టే అవుతుంది. ఈక్రమంలో అస్సాంలోని పేదింటి చెల్లికి రాఖీ కానుకగా సిమెంట్ సంచులతో ఉన్న గుడిసె స్థానంలో ఆమెకు ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చాడు. ఇలా సహాయం చేయాలనే మనస్సు ఉన్న సోనూకు డబ్బు ఎంత ఖర్చు అవుతుందనే ఆలోచనే లేదు. అడిగినవారికి లేదనకుండా దానం చేసిన అలనాటి దాన కర్ణుడి వారసుడిగా ఆపన్నహస్తం అందించటంలో తనకు తానేసాటి అని నిరూపించుకుంటున్నాడు ఈ రియల్ హీరో సోనూ సూద్.