గోదావరి జిల్లాల్లో అగ్రి టూరిజం..బోట్ డ్రైవర్లకు టెస్ట్ లు : మంత్రి అవంతి

తూర్పు గోదావరి జిల్లా టూరిజం రంగంలో పెట్టుబడిదారులతో మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చలు జరిపారు. ఈ సందర్బంగా మంత్రి అవంతి మాట్లాడుతూ..ఉభయ గోదావరి జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అగ్రి టూరింజాన్ని డెవలప్ చేస్తామని తెలిపారు.
దీంట్లో భాగంగా..డిసెంబర్ 10న పర్యాటక బోట్ల డ్రైవర్లకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షల్లో పాస్ అయినవారికి మాత్రమే బోట్లను డ్రైవింగ్ చేసే లైసెన్సులను మంజూరు చేస్తామన్నారు. టూరిజానికి సంబంధించిన టెండర్లను జ్యుడీషియల్ ఎంక్వైరీకి పంపిస్తామన్నారు.
ప్రపంచంలో 45శాతం దేశాలు టూరిజం మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని అన్నారు. అలాగే టూరిజానికి అవకాశం ఉన్న పలు ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి భద్రతకు ప్రాధాన్యం కల్పించాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈ క్రమంలో పర్యాటక ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని మంత్రి తెలిపారు.