చిన్నారులకు ప్రొటీన్ ఫుడ్ : సీఎల్పీ ఇండియాతో అక్షయ పాత్ర అగ్రిమెంట్

పోషకాహార లోపంతో చిన్నారుల మరణాలు భారత్ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామ మాత్రంగానే ఉన్నాయి. ఈ క్రమంలో చిన్నారులకు పోషకాహారాన్ని అందించి..వారి ఆరోగ్యాన్ని సంరక్షించాలనే ఉద్దేశ్యంతో సీఎల్పీ ఇండియాతో ‘అక్షయ పాత్ర ఫౌండేషన్’ ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్రంలోని 20 వేల మంది చిన్నారులకు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు ‘అక్షయ పాత్ర ఫౌండేషన్(టీపీఎఎఫ్)’ సీఎల్పీ ఇండియాతో అవగాహన అగ్రిమెంట్ నుచేసుకుంది. భారతీయ విద్యుత్తు రంగంలోని అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులలో సీఎల్పీ ఇండియా ఒకటి. తెలంగాణ ప్రభుత్వ ఇప్పటికే సర్కార్ స్కూల్స్ లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. కానీ స్కూల్స్ కు రాని చిన్నారులకు కూడా పోషకాహారాన్ని అందించాలనే సంకల్పంతో సీఎల్పీతో అక్షయపాత్ర ఫౌండేషన్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాగా ఇప్పటికే అక్షయ పాత్ర ఫౌండేషన్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషక్ష్ం తెలిసిందే. పేరుకు తగినట్లుగానే ఆకలిగొన్నవారికి అక్షయపాత్రలాగే పనిచేస్తుంది ఈ ఫౌండేషన్.
ఈ ఒప్పందంలో భాగంగా సీఎల్పీ ఇండియా సహకారంతో మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట వద్ద ఆగస్టు నాటికి ఒక వంటశాలను నిర్మించనుంది అక్షయపాత్ర ఫౌండేషన్. ఇక్కడి నుంచి జిల్లాలో స్కూల్స్..అంగన్‌వాడీల్లోని చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేయనున్నారు. అక్షయపాత్రతో భాగస్వామ్యాన్ని విస్తరించుకోవడాన్ని తాము గౌరవంగా భావిస్తున్నట్లు సీఎల్పీ ఇండియా సీఎస్ఆర్ డిపార్ట్ మెంట్ అధికారి
డాక్టర్ ప్రియేశ్ మోదీ తెలిపారు.