చంద్రబాబు లాంటి అవకాశవాది దేశంలో ఎక్కడా లేరు
గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు లాంటి అవకాశవాది దేశంలో ఎక్కడా లేరు అని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. నర్సరావుపేలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా, ఏపీ

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు లాంటి అవకాశవాది దేశంలో ఎక్కడా లేరు అని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. నర్సరావుపేలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా, ఏపీ
గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు లాంటి అవకాశవాది దేశంలో ఎక్కడా లేరు అని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. నర్సరావుపేలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. చంద్రబాబు తీరుపై షా విరుచుకుపడ్డారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతారని షా విమర్శించారు. 2014లో మోడీ హవా చూసి చంద్రబాబు ఎన్డీయేలో చేరారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల సమయంలో ఓటర్ల సానుభూతి కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోగానే.. ఏపీలో ఆ పార్టీకి దూరంగా జరిగారని విమర్శించారు. చంద్రబాబు సొంత మామకే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని అమిత్ షా అన్నారు. నమ్మినవారిని మోసం చెయ్యడమే బాబు నైజం అన్నారు.
ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని షా చెప్పారు. బీజేపీ గెలిపిస్తే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మోడీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేసిందన్నారు. విభజన చట్టంలోని 14 హామీల్లో 11 హామీలను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం రూ.7వేల కోట్లు ఇచ్చిందన్నారు. ఆ డబ్బుని చంద్రబాబు, మంత్రులు తమ ఖాతాల్లోకి మళ్లించారని, పోలవరం ప్రాజెక్ట్ పనలు ఆగిపోయేలా చేశారని షా ఆరోపించారు. మోడీ గెలిస్తే మళ్లీ ఎన్డీయేలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారని.. కానీ.. చంద్రబాబుకి ఎన్డీయే ద్వారాలు శాశ్వతంగా మూసేశామని షా స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని షా ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.