అమరావతిలో ఆందోళనలు: వెంకయ్యనాయుడుని కలవనున్న రైతులు

  • Published By: vamsi ,Published On : December 24, 2019 / 05:00 AM IST
అమరావతిలో ఆందోళనలు: వెంకయ్యనాయుడుని కలవనున్న రైతులు

Updated On : December 24, 2019 / 5:00 AM IST

మూడు రాజధానుల ప్రతిపాదనలపై అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతూ ఉంది. నేటి కార్యాచరణను రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. ఉదయం 8.30 గంటలకు కృష్ణాయపాలెంలో రైతుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

అదే సమయానికి వెలగపూడి, మందడంలో రైతులు ధర్నా మొదలు పెట్టారు. తుళ్లూరులో మహాధర్నా కొనసాగుతుంది. వీరితోపాటు ‘ఛలో హైకోర్టు’ పేరుతో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో రాజధాని రైతులు భేటీ కానున్నారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించనున్నారు. గవర్నర్‌తో భేటీకి సమయం కోరారు. అయితే ధర్నాలు చేస్తున్న రైతులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు.

తుళ్ళూరులో ధర్నాకి టెంట్ వేస్తున్న రైతులను ఎక్కడికి అక్కడ అడ్డుకుంటున్నారు. టెంట్ వెయ్యవద్దు అని ఆంక్షలు పెడుతున్నారు పోలీసులు.