మీడియాకు తెలియకపోవటం వల్లే అమృత తల్లిని కలవగలిగింది

  • Published By: chvmurthy ,Published On : March 15, 2020 / 05:55 AM IST
మీడియాకు తెలియకపోవటం వల్లే అమృత తల్లిని కలవగలిగింది

Updated On : March 15, 2020 / 5:55 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఏడాదిన్నర క్రితం సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరునగరి మారుతీరావు మార్చి7న  హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తన సూసైడ్ నోట్ లో తన భార్య కుమార్తెలను ఉద్దేశించి..గిరిజా క్షమించు…తల్లి అమృత నువ్వు అమ్మ దగ్గరికి వెళ్లిపో….. అని సూసైడ్ నోట్ రాసి మరణించాడు. తండ్రి మరణించిన తర్వాత పార్థివ దేహాన్ని కడసారి చూడటానికి పోలీసు రక్షణలో అమృత స్మశానానికి వెళ్లినా…. బంధువులు ఆమెను అడ్డుకోవటంతో వెనుదిరిగి వెళ్లిపోయింది. 

మారుతీరావు ఏర్పాటు చేసిన కిరాయి గూండాల చేతిలో ప్రణయ్  హత్యకు గురైనప్పటినుంచి మీడియా అమృతని వదలటంలేదు. ఆమెను ప్రతి క్షణం ఫాలో అవుతూనే ఉంది. మీడియా కంటపడకుండా ఆమె ఏపని చేయలేక పోతోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అమృత మీడియా కంట పడకుండా పోలీసు రక్షణతో తల్లి గిరిజను కలిసి వెళ్లింది. ఇంటి నుంచి కారులో వెళుతున్న అమృతను పోలీసులు ఫాలో అయ్యారు. ఈవిషయాన్ని అమృత గొప్యంగా ఉంచింది. 

కూతురిని చూడగానే తల్లి గిరిజ తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. సుమారు పావుగంట సేపు అమృత తల్లి వద్ద ఉంది. తల్లిని పరామర్సించిన అనంతరం  మారుతీరావు నివాసం నుంచి తిరిగి పోలీసు రక్షణలో ఆమె అత్తారింటికి వెళ్లిపోయింది. తల్లిని కల్సిన తర్వాత కూడా అమృత మీడియా కంట కనపడకుండానే వెళ్లిపోయింది. ఈవిషయాన్ని ఇంటి చుట్టుపక్కలవారు చెప్పటంతో వెలుగులోకి వచ్చింది.  మీడియా కంట కనపడకపోవటం వల్లే అమృత తల్లితో మాట్లాడి వెళ్లగలిగిందని స్ధానికులు అనుకుంటున్నారు. 

కాగా శుక్రవారం సాయంత్రం మిర్యాలగూడ నాగార్జున నగర్ లో తన తండ్రి మారుతీరావుకు చెందిన  ప్లాట్స్ ను పరిశీలించింది. ఒక వ్యక్తి ఆమెను బైక్ పై ఎక్కించుకురాగా….ఎవరూ గుర్తుపట్టకుండా  మొఖానికిస్కార్ఫ్ కట్టుకుని ఆమె ప్లాట్స్ వద్దకు వచ్చింది. వాటిని ఫోటోలు తీసుకుంది. వాటి వద్ద నిలబడి సెల్పీలు తీసుకుంది.  స్దానికులు కొందరు అమృతను గుర్తించి వారి సెల్ ఫోన్ లో ఫోటోలు తీయటంతో ఈ విషయం వెలుగు చూసింది.