అనంతపురంలో 5 సీట్లే ఖరారు : మంత్రికి టిక్కెట్ లేనట్లేనా?

  • Published By: vamsi ,Published On : March 15, 2019 / 05:20 AM IST
అనంతపురంలో 5 సీట్లే ఖరారు : మంత్రికి టిక్కెట్ లేనట్లేనా?

Updated On : March 15, 2019 / 5:20 AM IST

ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు, రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లా కంచుకోట. జిల్లాలోని 14 అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్లు ఉన్న ఈ జిల్లాలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో ప్రతి జనరల్ ఎలెక్షన్స్ లోనూ తెలుగుదేశం పార్టీ పదికి పైగా గెలుస్తూ వస్తుంది. ఈ క్రమంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్ధులను ప్రకటించే విషయమై అనేక సర్వేలు, సమీక్షలు నిర్వహించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. సీట్ల ఎంపికను పూర్తి చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
Read Also: గుంటూరు జిల్లాలో 14సీట్లు ఖరారు: నారా లోకేష్ ఎంట్రీ.. రసవత్తరంగా రాజకీయం

ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో 5నియోజకవర్గాలకు మాత్రమే చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించారు. ఇక జిల్లాలో ప్రధానంగా చెప్పుకునే కుటుంబాలలో ఒకటి పరిటాల కుటుంబం.. ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై మంత్రిగా చేస్తున్న పరిటాల సునీత ఈసారి రాప్తాడు నుంచి పోటీ చేయట్లేదు. ఆమె స్థానం నుంచి చంద్రబాబు పరిటాల కొడుకు శ్రీరామ్‌కు అవాకాశం ఇచ్చారు. అయితే ఆమెను వేరే స్థానానికి పంపుతారా? లేకుంటే అసలు పోటీలో ఆమె ఉండదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 
ఓసీలు- 04
బీసీలు-01

అనంతపూరం జిల్లా తెలుగుదేశం అభ్యర్ధులు:
రాప్తాడు – పరిటాల శ్రీరామ్
హిందుపూర్‌ – నందమూరి బాలకృష్ణ 
పెనుగొండ – బి.కె.పార్థసారథి
పుట్టపర్తి – పల్లె రఘునాథ రెడ్డి
ధర్మవరం – జి.సూర్యనారాయణ

ఖరారు కాని స్థానాలు:
అనంతపురం సిటీ
ధర్మవరం
తాడిపత్రి
మడకశిర
ఉరవకొండ
కదిరి 
కళ్యాణ దుర్గం
గుంతకల్లు  
సింగనమల‌