ఎన్నికల సందడి : మార్చి 13న టీడీపీ మొదటి జాబితా ?

  • Published By: madhu ,Published On : March 10, 2019 / 08:47 AM IST
ఎన్నికల సందడి : మార్చి 13న టీడీపీ మొదటి జాబితా ?

ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందా ? అని ఏపీలోని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అనుకున్నట్టుగానే వారి నిరీక్షణ కొద్ది గంటల్లో తీరబోతోంది. ఎన్నికల షెడ్యూల్‌ని మార్చి 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంటలకు కేంద్ర ఎన్నికల అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు చక చకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనితో విజ్ఞాన్ భవన్ వద్ద సందడి నెలకొంది. ఏపీలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే ఈ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి కూడా. 

ప్రధానంగా మరోసారి అధికారంలోకి రావాలని యోచిస్తున్న సీఎం బాబు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నారు. 15 రోజులుగా పార్లమెంటరీ నియోజకవర్గాలుగా బాబు మీటింగ్‌లు జరుపుతూ అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. ఈ జాబితా తుది దశకు చేరుకుంది. అయితే కొన్ని జిల్లాల్లో సమస్యలు ఏర్పడడంతో అక్కడ అభ్యర్థులను ఖరారు చేయలేదని తెలుస్తోంది. ఏమైనా మార్చి 13వ తేదీ మొదటి జాబితా విడుదల చేయాలని బాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఎంతమంది స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేస్తారనేది తెలియరాలేదు. 120 అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి షెడ్యూల్ విడుదలవుతుండడంతో రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది.