YSRCP అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో తనిఖీలు

ఎన్నికల నామినేషన్ల దాఖలుకు 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. నేతలు మాటలు తూటాలు పేలుస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలను ఈసీ, పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు భారీగా నగదు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు పట్టుబడుతున్నాయి.
Read Also : జగన్‌కి ఒక్క ఛాన్స్ ఇస్తే : ప్రశాంతంగా బతకలేరు
పోలీసులు ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు జరపడం తీవ్ర కలకలం రేపింది. కాపు రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మార్చి 21వ తేదీ గురువారం పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు. నగదు, చీరలు దాచి పెట్టారన్న సమాచారంతో పోలీసులు వచ్చారు. ఇంట్లో సోదాలు చేసినా ఎలాంటి వస్తువులు బయటపడలేదని తెలుస్తోంది. అయితే ఓ గదికి మాత్రం తాళం వేసి ఉందని, తాళం కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నట్లు సమాచారం.
Read Also : ‘Notebook’ : కాశ్మీర్ సమస్యకు సల్లూ భాయ్ సూచన