చంద్రబాబు మెరుపు ధర్నా
ఎన్నికల సంఘం తీరుకునిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు ధర్నా చేపట్టారు.

ఎన్నికల సంఘం తీరుకునిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు ధర్నా చేపట్టారు.
అమరావతి : ఎన్నికల సంఘం తీరుకునిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు ధర్నా చేపట్టారు. బుధవారం ఈసీ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి తన ప్రతినిధులను ఢిల్లీ పంపిన చంద్రబాబు బుధవారం అమరావతి లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కూడా కలిసి వినతి పత్రం అందచేశారు. అనంతరం ఆఫీసు బయటకు వచ్చి ధర్నా చేసారు.
“ఎన్నికల కమీషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. బీజేపీ ఆఫీసులా మారింది. మోడీ ఏం చెప్తే అది చేసే పరిస్ధితిలా వచ్చింది ఎన్నికల సంఘం.” “ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోటానకి .సీనియర్ పోలిటిషియన్ గా నేనే వచ్చాను, నిరసన తెలుపుతున్నానుఅని చంద్రబాబు అన్నారు. ఈ నిరసన వల్ల నైనా ఎన్నికల కమీషన్ లో మార్పు వస్తుందను కుంటున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : మీ పద్దతి బాగోలేదు : ఈసీని కలిసి వినతిపత్రం ఇచ్చిన చంద్రబాబు
ఎన్నికల కమీషన్ లో మార్పు వచ్చేంత వరకు ప్రజాస్వామ్యవాదులంతా ఎక్కడి కక్కడ వత్తిడి తేవాలని, నిరసన తెలియ చేయాలని బాబు కోరారు. ఎవరైతే ప్రజాస్వామ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారో వారికి బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. ఇప్పటి కైనా ఎలక్షన్ కమీషన్ ఢిల్లీలోనూ, స్టేట్ లోనూ మార్పుతెచ్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
“రాష్ట్ర ఎన్నికల సంఘం కూడాఢిల్లీ ఏం చెపితే అది చేయటం కాదు, వీళ్లు కూడా ఏకపక్షంగా వ్యవహరించటం మంచిది కాదు. వీళ్ళు ఢిల్లీ వాళ్లకు చెప్పాలి” అని చంద్రబాబు హితవు చెప్పారు. ఐటీ రైడ్స్ ఏకపక్షం గా చేశారు. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల టైమ్ లో టీడీపీని ఇబ్బంది పెట్టారు. ఇలా చేయటం మంచిదికాదని చంద్రబాబు అన్నారు.
Read Also : కొండా విశ్వేశ్వరరెడ్డిపై ఈసీ చర్యలు ఉంటాయా