ఆటో డ్రైవర్ల కృతజ్ఞతలు : ఆటోవాలాగా మారిన బాబు

విజయవాడ : బాబు ఆటోవాలాగా మారిపోయారు. ఖాకీ షర్ట్ వేసుకున్న బాబు ఆటో తోలారు. ప్రతొక్క ఆటోకు పచ్చజెండా పెట్టుకోవాలని…ఆటో వెనుక భాగంలో థాంక్స్ సీఎం సార్ అంటూ బోర్డు పెట్టుకోవాలంటున్నారు బాబు. ఆటో డ్రైవర్లకు పెద్దన్నగా తానుంటానని..వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు.
ఏపీ సర్కార్‌కి థాంక్స్ చెబుతున్నారు ఆటోవాలాలు. జీవిత కాలం పన్ను ఎత్తివేయడం హర్షనీయమని పేర్కొంటున్నారు. బాబుకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఆటో డ్రైవర్లు ఫిబ్రవరి 02వ తేదీ శుక్రవారం ఆయన నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా బాబు ఆటో డ్రైవర్లు వేసుకునే డ్రెస్ వేసుకుని స్పీచ్ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల ఆదాయం పెంచేందుకు తాను కృషి చేయడం జరుగుతుందని…ఇన్సూరెన్స్ విషయంలో నెలకొన్న సమస్యలు..ఇతరత్ర వాటిని పరిష్కరిస్తానని హామీనిచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందని…ఆటో రంగంలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.