రాజధాని భూముల కేసు సీబీఐ కి అప్పగించిన జగన్ సర్కార్

ఏపీ రాజధాని భూములు కేసును సీబీఐ కి అప్పగిస్తూ జగన్ సర్కార్ రకీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును సీబీఐకి బదిలీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ఇచ్చింది. రాజధాని ప్రాంతాన్ని ముందుగా కొంతమందికి చెప్పి వేల కోట్ల రూపాయల లబ్ది చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని భూముల వ్యవహారంపై జగన్ సర్కార్ మొదట్లో సిట్ ను ఏర్పాటు చేసింది. అనంతరం కేబినెట్ సబ్ కమిటీ వేసి కమిటీ వేసి ఇందులో నిజానిజాలను నిగ్గు తేల్చింది. అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, తాము వేసిన సబ్ కమిటీ విచారణలో ఆ విషయం నిర్ధారణ అయ్యిందని ప్రభుత్వం చెబుతోంది. దాంతో ఈ వ్యవహారాన్ని సీబీఐ కి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అమరావతి రాజధాని ప్రాంతంలో 4 వేల ఎకరాల భూములకు సంబంధించిన అక్రమాలుజరిగాయని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. సబ్ కమిటీ నివేదికను కూడా జగన్ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు పంపించింది. రాజధాని భూముల వ్యవహారంలో అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఎస్సీ ఎస్టీలను బెదిరించి భూములు కొనుగోళ్ళ కేసులను సీబీఐకి బదిలీ చేస్తూ జీవో నెంబరు 46 ని ఏపీ హోం శాఖ కార్యదర్సి సోమవారం విడుదల చేశారు.