ఏపీలో ప్రలోభాలు : రూ.16.53 కోట్లు, రూ.4.22 కోట్ల బంగారం సీజ్ – ద్వివేదీ

  • Published By: madhu ,Published On : March 19, 2019 / 12:00 PM IST
ఏపీలో ప్రలోభాలు : రూ.16.53 కోట్లు, రూ.4.22 కోట్ల బంగారం సీజ్ – ద్వివేదీ

Updated On : March 19, 2019 / 12:00 PM IST

ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకొకముందే అప్పుడే భారీగా నగదు పట్టుబడుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 16.53 కోట్ల నగదు, రూ. 4.22 కోట్ల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నామని ఏపీ సీఈవో ద్వివేదీ వెల్లడించారు. మార్చి 19వ తేదీ మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 7.35 కోట్ల విలువైన మద్యాన్ని ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిందన్నారు. రూ. 22 కోట్ల విలువైన చీరలు, ఫ్యాన్లు, ఫోన్లు, మిక్సీలు, స్పోర్ట్స్ కిట్స్, గడియారాలను వాణిజ్య పన్నుల శాఖ గుర్తించిందన్నారు. 
Read Also : జగన్, కేసీఆర్, మోడీ కుట్రలు చేస్తున్నారు : సీఎం చంద్రబాబు

సోషల్ మీడియాకు సంబంధించి రాజకీయ పార్టీలకు 89 నోటీసులిచ్చినట్లు వెల్లడించారు ద్వివేదీ. టీడీపీకి 48, వైసీపీకి 30, జనసేనకు 11 నోటీసులిచ్చినట్లు తెలిపారు. వాట్సప్‌లో పంపే వాయిస్ మెసేజ్‌లకు మీడియా సర్టిఫికేషన్ అవసరమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 175 నియోజకవర్గాల్లో 3 వేల 635 సీ-విజిల్ టీమ్‌లతో పరిశీలన చేస్తున్నట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 1,304 ఫిర్యాదులు అందితే..70 శాతం పరిష్కరించినట్లు చెప్పారు. ఏప్రిల్ 6వ తేదీ నాటికి కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామన్నారు ఏపీ సీఈవో ద్వివేదీ.