IPS బదిలీలపై కోర్టుకు ఏపీ సర్కార్
ఐపీఎస్‌ల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్గిలమీద గుగ్గిలమవుతోంది. ఇంటెలిజెన్స్ చీఫ్‌తో సహా కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై ఈసీ బదిలీ చేసింది.

ఐపీఎస్‌ల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్గిలమీద గుగ్గిలమవుతోంది. ఇంటెలిజెన్స్ చీఫ్‌తో సహా కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై ఈసీ బదిలీ చేసింది.
ఐపీఎస్‌ల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్గిలమీద గుగ్గిలమవుతోంది. ఇంటెలిజెన్స్ చీఫ్‌తో సహా కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై ఈసీ బదిలీ చేసింది. దీనిపై టీడీపీ సర్కార్ రెస్పాండ్ అయ్యింది. బదిలీలు దారుణమని పేర్కొంది. దీనిపై న్యాయపోరాటం చేయాలని భావించింది. అందులో భాగంగా మార్చి 27వ తేదీ బుధవారం కోర్టు మెట్లు ఎక్కింది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారణకు హైకోర్టు అనుమతినిచ్చింది.
Read Also : కాంగ్రెస్ లో అంతేగా : టికెట్ ఇవ్వలేదని.. పార్టీ ఆఫీస్ సామాను ఎత్తుకెళ్లిన ఎమ్మెల్యే
బదిలీలపై సీఎం బాబు తీవ్రస్థాయిలో స్పందించారు. అసలు అధికారులను ఎలా బదిలీ చేశారు అంటూ ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరును తాను తప్పుబడుతున్నట్లు వెల్లడించారు. ఐపీఎస్ బదిలీలపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీని అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తోందంటు దయ్యబట్టారు బాబు.
ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్‌లపై సీఈసీ మార్చి 26వ తేదీ మంగళవారం యాక్షన్ తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ సహా కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల విధుల నుంచి ఆ ముగ్గురిని తప్పించింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేసింది. ఎన్నికల పోలింగ్‌కి సరిగ్గా రెండు వారాల ముందు ఈసీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.