ముహూర్తం ఫిక్స్ : ఇక విశాఖ నుంచే పరిపాలన

విశాఖ రాజధాని గురించి, పరిపాలన గురించి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ రోజైనా విశాఖ నుంచి ప్రభుత్వం.. పరిపాలన

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 12:48 PM IST
ముహూర్తం ఫిక్స్ : ఇక విశాఖ నుంచే పరిపాలన

Updated On : February 12, 2020 / 12:48 PM IST

విశాఖ రాజధాని గురించి, పరిపాలన గురించి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ రోజైనా విశాఖ నుంచి ప్రభుత్వం.. పరిపాలన

విశాఖ రాజధాని గురించి, పరిపాలన గురించి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ రోజైనా, ఏ క్షణమైనా విశాఖ నుంచి ప్రభుత్వం.. పరిపాలన ప్రారంభించవచ్చని చెప్పారు. సీఎం జగన్ ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చున్నారు. విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కానుందని మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇప్పటికే విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా జగన్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అక్కడి నుంచి పాలన ప్రారంభించాలని అనుకుంటోంది. ఇప్పుడు మంత్రి చేసిన వ్యాఖ్యలు.. అందుకు బలాన్ని ఇచ్చాయి.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం.. మూడు రాజధానుల అంశంలో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందడం చంద్రబాబుకి ఇష్టం లేదన్నారు. రాజధాని రైతులను చంద్రబాబు తప్పుదారి పట్టించారని, వారిని రెచ్చగొట్టారని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు మాయలో పడొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. అమరావతి ప్రాంత రైతులకు ఎలాంటి నష్టం జరక్కుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అమరావతి లెజిస్లేటివ్ కేపిటల్ గా, విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా, కర్నూలును జ్యూడీషియల్ కేపిటల్ గా చేయాలని జగన్ నిర్ణయించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకి అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపింది. దీనికి సంబంధించి సీఎం జగన్.. ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మూడు రాజధానులకు ఆమోద ముద్ర వేయించుకునే పనిలో ఉన్నారు.