మహిళా పోలీసులపై కూడా దాడులు చేశారు : జాతీయ మహిళా కమిషన్ కు ఏపీ పోలీస్ సంఘం ఫిర్యాదు
జాతీయ మహిళా కమిషన్ కు ఏపీ పోలీస్ సంఘం ఫిర్యాదు చేసింది. మహిళా పోలీసులపై కూడా దాడులు చేశారని గుంటూరులో పర్యటిస్తున్న కమిషన్ సభ్యులకు వివరించారు.

జాతీయ మహిళా కమిషన్ కు ఏపీ పోలీస్ సంఘం ఫిర్యాదు చేసింది. మహిళా పోలీసులపై కూడా దాడులు చేశారని గుంటూరులో పర్యటిస్తున్న కమిషన్ సభ్యులకు వివరించారు.
జాతీయ మహిళా కమిషన్ కు ఏపీ పోలీస్ సంఘం ఫిర్యాదు చేసింది. మహిళా పోలీసులపై కూడా దాడులు చేశారని గుంటూరులో పర్యటిస్తున్న కమిషన్ సభ్యులకు వివరించారు. తామూ మహిళలమే..మాకు కూడా రక్షణ కావాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో చెప్పుకోలేని సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు చెబితే సర్దుకుపొమ్మంటున్నారని తెలిపారు.
ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో పోలీసుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అరెస్టు చేసిన మహిళలను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం కలకలం రేపుతోంది. చీకటి పడినా..మహిళలను విడుదల చేయడం లేదు. మహిళలను ఒక్కొక్కరిగా ఫొటోలు తీస్తున్నారు. ఆధార్ నెంబర్, ఇంటి అడ్రస్‌లు ఇస్తేనే..విడుదల చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు.
రాజధానిలో ఆందోళనలు మరింత ఉధృతమౌతున్నాయి. మూడు రాజధానుల ప్రకటన, GN RAO కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయాయి. 24 రోజులుగా ఎక్కడికక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును పలువురు ఎండగడుతున్నారు. అమరావతిలో మహిళా రైతులపై దాడి ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. అమరావతికి నిజనిర్ధారణ కమిటీని పంపించనున్నట్లు ఈ మేరకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం, పోలీసులపై గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 144 సెక్షన్ ఉగ్రవాదులు, మావోయిస్టులపై వాడాలి..కానీ ఇక్కడ రైతులపై ప్రయోగిస్తున్నారని వాపోయారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. ఆదివారం (జనవరి 12, 2020) గుంటూరులో జాతీయ మహిళా కమిషన్ బృందాన్ని టీడీపీ నేతలు కలిశారు.
రాజధాని ప్రాంత మహిళలపై దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఎంపీ గల్లా జయదేవ్, పంచుమర్తి అనురాధ వెల్లడించారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ రైతులు, మహిళలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని గల్లా జయదేవ్ అన్నారు. రాజధాని పరిస్థితులను కమిషన్ ను దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దాడికి సంబంధించిన ఆధారాలు వారికి సమర్పించామని తెలిపారు.
మహిళలపై జరిగిన లాఠీఛార్జ్ ఘటనపై నిజనిర్ధారణ కోసం అమరావతికి వచ్చిన జాతీయ మహిళా కమిషన్ బృందం ఇవాళ విచారణ జరుపుతున్నారు. కమిషన్ ప్రతినిధులు… ఇవాళ తుళ్లూరు, మందడంలో పర్యటించనుంది. రాజధాని ఉద్యమంలో మహిళలపై జరిగిన దాడి ఘటనపై క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది.
రాజధాని తరలింపుపై ఏపీ రగిలిపోతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసనలతో 29 గ్రామాలు హోరెత్తుతున్నాయి. 26వరోజు కూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు మహా ధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలేదీక్షలు కంటిన్యూ అవుతున్నాయి. ఉద్దండరాయునిపాలెంలోను వివిధ గ్రామాలకు చెందిన రైతులు నిరసనలు తెలుపుతున్నారు.