ఒంటికాలితో పుట్టిన శిశువు 

  • Published By: veegamteam ,Published On : May 3, 2019 / 04:03 AM IST
ఒంటికాలితో పుట్టిన శిశువు 

Updated On : May 3, 2019 / 4:03 AM IST

గర్భంతో ఉన్న మహిళలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాలలో పుట్టే శిశువులు అంగవైకల్యాలతో పుట్టటం జరుగుతుంటుంది. ఇటువంటివి జన్యుపరమైన లోపాలతో జరుగుతుంటాయని డాక్టర్స్ చెబుతుంటారు. ఈ క్రమంలో ఒంటికాలితో  ఓ శిశువు  జన్మించింది. ఈ  ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జన్యులోపం  ఒంటికాలితో ఉన్న శిశువు పుట్టింది. గురువారం (మే 2)ఉదయం వట్‌పల్లి మండలం పోతులబొగుడకు చెందిన సుజాత అనే మహిళ  డెలివరీ కోసం ఎంసీహెచ్‌లో అడ్మిట్‌ అయ్యింది. నొప్పులు రావడంతో డాక్టర్స్ సిజేరియన్ చేసి శిశువును బయటకు తీశారు. ఆ  శిశువుకు రెండు చేతులు సక్రమంగానే ఉన్నాయి… కానీ   రెండు కాళ్లు కలిసిపోయి ఒకే కాలు మాదిరి ఉన్నదని డాక్టర్ అశోక్ తెలిపారు.

ఇటువంటి జననాలు చాలా జరుగుతూ ఉంటాయని.. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉందని, బతకడం చాలా కష్టమని తెలిపారు. పుట్టిన బిడ్డ బరువు తక్కువగా ఉండటం.. జననేంద్రియాలు ఏవీ లేవని, సిరినోమిలియా అనే జన్యు సంబంధ లోపం వల్ల ఇలాంటి శిశువులు జన్మిస్తారని డాక్టర్ అశోక్ వెల్లడించారు.