బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ : సీఎం జగన్  

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 06:27 AM IST
బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ : సీఎం జగన్  

Updated On : November 28, 2019 / 6:27 AM IST

బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని  సీఎం జగన్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త జ్యోతిరావు గోవిందరావు ఫులే 129వ వర్థంతి సభలో సీఎం జగన్ పాల్గొన్ని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీసీలంటే  పనిముట్లు కాదు. బీసీలు మన సంస్కృతి సంప్రదాయాలకు వెన్నెముకలని అన్నారు. 

ఎన్నికల ముందు తన పాదయాత్రలో బీసీ వర్గానికి చెందినవారి కష్టాల గురించి తెలుసుకున్నాను. వారి కష్టాలు తెలుసుకున్న తాను చలించిపోయాననీ పాదయాత్ర ముగింపు సభలో వారి అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంటానని మాట ఇచ్చాననీ.. దాని కట్టుబడి ఉన్నానని తెలిపారు. మాట ఇస్తే ఆ మాటకు ప్రతీ మనిషీ కట్టుబడి ఉండాలి అందుకే ఎంతటి కష్టనష్టాలనైనా భరించి అణగారిన వర్గాల కోసం పాటు పడతానని సీఎం జగన్  జ్యోతీరావ్ పూలే సందర్భంగా హామీ ఇచ్చారు.

మానిఫెస్టోలో వాగ్ధానం చేసిన ప్రతీ హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చేందుకు ప్రతీ అంశాన్ని విశ్లేషించి..ఆలోచించి ఒక్కో అడుగు వేస్తున్నామన్నారు. దాంట్లో భాగంగానే..వెనుకబడిని కులాలకు చెందినవారిని కేబినెట్ లోకి సముచిత స్థానాన్ని కల్పించామన్నారు. 

ప్రతీ పేదవాడు చదువుకోవాలనే ఉద్దేశ్యంతో జ్యోతిరావు పూలే పేదలకు చదువు చెప్పిన గొప్ప సంస్కర్త జ్యోతీరావ్ పూలే. పూలే స్ఫూర్తిగా తీసుకున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్ధుల కోసం ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేశారని సీఎం జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అణగారిన వర్గాల పిల్లలు చదువు కోసం తమ ప్రభుత్వం ఎన్నో అవకాశాల్నికల్పిస్తోందని తెలిపారు.

అణగారిన వర్గాలవారు పడిన కష్టాల్ని తన పాదయాత్ర ద్వారా తగ్గర నుంచి చూశాననీ.. వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. దేశం కోసం పోరాడిన జ్యోతిరావ్ పూలే వంటి మహనీయుల సేవల్ని ఎప్పటికీ మరువలేమని ఆయన జాడల్లో నడిచి ప్రతీ పేదవాడికి చదువుకునేలా చర్యలు తీసుకంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మహానీయులు చూపించిన బాటలో నడిచి ప్రతీ ఒక్కరూ విద్యలో రాణించాలని తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సీఎం జగన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.