టిట్ ఫర్ టాట్ : పాక్ పై భారత్ బాంబుల వర్షం 

  • Published By: veegamteam ,Published On : February 26, 2019 / 04:14 AM IST
టిట్ ఫర్ టాట్ : పాక్ పై భారత్ బాంబుల వర్షం 

Updated On : February 26, 2019 / 4:14 AM IST

జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని భారత్ సైన్యం తగిన గుణపాఠం చెప్పింది. భారత సైనికులపై పాక్ ఉగ్రదాడికి ప్రతీకారం తీసుకోవాలనే మన సైన్యం వేయి కళ్లతో ఎదురు చూసింది. దానికి తగినట్లుగా భారత్ పాకిస్థాన్ పై సర్జికల్ దాడులతో విరుచుకుపడింది. 
 

పాక్ పై భారత్ సైన్యం మరోసారి సర్జికల్ దాడులతో విలతాండవం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం బాంబులతో విరుచుకుపడింది. మిరాజ్ యుద్ధ విమానాలతో ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. వైమానిక బృందం మంగళవారం (ఫిబ్రవరి 26) తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారత్‌ పాక్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్‌లోని పంఖ్తుఖ్వా ప్రావిన్సుల్లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా సర్జికల్ దాడులు చేసింది. నియంత్రణ రేఖకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంపై మిరాజ్ 2000 విమానాలతో విరుచుకుపడింది.

వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు బాలకోట్, చకోటి, ముజఫరాబాద్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో జైషే మహ్మద్‌కు చెందిన అల్ఫా-3 కంట్రోల్ రూమ్‌లు ధ్వంసమయ్యాయని తెలిపాయి. ఈ దాడులను ధ్రువీకరిస్తూ పాకిస్థాన్ సైన్యం ట్వీట్ చేసింది. భారత యుద్ధ విమానాలు పేలోడ్‌కు పాల్పడినట్టు ఫోటోలను పాక్ ఆర్మీకి చెందిన మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఉరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి తర్వాత 2016 సెప్టెంబరు 28న భారత్ సర్జికల్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.