వైసీపీ లాలూచీలు ‘టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్’బైటపెట్టింది

అమరావతి : బీజేపీ-వైసీపీ లాలూచీ వ్యవహారాలను ‘టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్’ బైటపెట్టిందని చంద్రబాబు నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు తెలిపారు. వైసీపీ అధినేత జగన్ దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయనీ..మార్చి 14 ఉదయం నేతలతో మిషన్ ఎలక్షన్ -2019పై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా నేతలకు బాబు దిశానిర్ధేశం చేస్తు..ఏపీకి వ్యతిరేకంగా రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడే మూడు పార్టీలతో జగన్ పెట్టుకున్న తెరవెనుక సంబంధాలు వెలుగు చూస్తున్నాయని..దీనికి సంబంధించి అన్ని ఆధారాలతో జగన్ అడ్డంగా దొరికిపోయారన్నారు.
ఈ లాలూచీలో భాగంగా వైసీపీ బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాలలో తన పార్టీలోని బలహీన అభ్యర్థులను దించుతారనీ..జగన్ అక్కడ..మోడీకి ఇక్కడ కేసీఆర్ కు దాసోహమంటున్నారనీ..వైసీపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరేననీ..కర్నల్ సింగ్ లేఖే మూడు పార్టీల లాటూచీ బయటపెట్టిందని చంద్రబాబు తెలిపారు. రోజు రోజుకు జగన్ లోను..మోడీలోను ఫ్రస్టేషన్ పెరుగుతోందన్నారు. నేతలను ప్రలోభాలతో పార్టీలో చేర్చుకున్న వారిని కూడా జగన్ మోసం చేస్తున్నారని..జగన్ చేతిలో మోసపోయినవారు తిరిగి టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారనీ చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ లో జగన్ షెల్ కంపెనీల భూములకు కేసీఆర్ కాపలా కాస్తున్నారనీ..ఏపీ టీఆర్ఎస్ గా వైసీపీ మారిందని విమర్శించారు. రాత్రీ పగలు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామనీ..ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో అందరూ కలిసికట్టుగా కష్టపడి విజయం సాధిద్దామని టెలీకాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్ధేశం చేశారు.