వాడెవడండీ బాబూ : ఆ సీమ పోలింగ్ బూతుల్లో మంత్రించిన ఆవాలు

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ హడావిడి.. ఎవరికి ఎన్నిఓట్లు పడుతున్నాయి.. ఎవరు ఎవరికి వేస్తున్నారు అంటూ ఉత్కంఠ.

  • Published By: veegamteam ,Published On : April 13, 2019 / 10:10 AM IST
వాడెవడండీ బాబూ : ఆ సీమ పోలింగ్ బూతుల్లో మంత్రించిన ఆవాలు

Updated On : April 13, 2019 / 10:10 AM IST

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ హడావిడి.. ఎవరికి ఎన్నిఓట్లు పడుతున్నాయి.. ఎవరు ఎవరికి వేస్తున్నారు అంటూ ఉత్కంఠ.

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ హడావిడి.. ఎవరికి ఎన్నిఓట్లు పడుతున్నాయి.. ఎవరు ఎవరికి వేస్తున్నారు అంటూ ఉత్కంఠ. బూతుల దగ్గర ఒకటే హంగామా, కొట్లాటలు, తోపులాటలు, వాగ్వాదాలు, దౌర్జన్యాలు ఇలా ఎవరి స్థాయిలో వాళ్లు దుమ్మురేపుతున్నారు. టీడీపీ-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వీళ్లందరికీ భిన్నంగా వ్యవహరించాడు ఆ అభ్యర్థి. చాలా కూల్.. ప్రశాంతంగా ఉన్నాడు. నేను చేయాల్సింది చేశాను.. దేవుడు కూడా అనుకూలించాలి కదా అనుకున్నాడు. ఒక్కరోజు దేవుడు ఓటరు అన్న సంగతి మర్చిపోయి.. పోలింగ్ రోజు కూడా కనిపించని దేవుడిపైనే భారం వేశాడు. ఉదయం అంతా ట్రెండ్ చూశాడు.. ఎందుకో ఏమో అనుమానం వచ్చింది.. అంతే.. వెంటనే రూటు మార్చాడు.
Read Also : కొంప, కుటుంబం వద్దా రా : 12 గంటల డ్యూటీ చేసిన చైనా కంపెనీలు

ఓటింగ్ వ్యతిరేకంగా ఉంటుందని అంచనా వేసిన ఆ అభ్యర్థి స్వయంగా రంగంలోకి దిగాడు. అసలే రాయలసీమ.. సార్ రంగంలోకి దిగారు అంటే ఇంక సీన్ మారిపోతుంది అనుకున్నారు అంతా. అబ్బే అలాంటిది ఏమీ లేకుండా.. 40 కాగితం పొట్లాలు జేబులో పెట్టుకుని బండి తీశాడు. నేరుగా పోలింగ్ బూతులోకి వెళ్లటం.. కాగితాలు ఓపెన్ చేయటం.. అందులోని తెల్ల ఆవాలను చల్లటం. ఇలా ఏకంగా.. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య 40 పోలింగ్ బూతుల్లో తెల్లఆవాలు చల్లుకుంటూ పోయాడంట. ఇతని వైఖరి అర్థంకాక ఏజెంట్లు పోలింగ్ సిబ్బంది అవాక్కయ్యి చూశారంట. ఇతనేంటీ ఇలా చేస్తున్నాడంటూ లైట్ తీసుకున్నారు.

ఓ పోలింగ్ బూత్ లో ఓ అయ్యవారు ఉన్నారంట. తెల్లఆవాలు చల్లటం చూసి నిలదీశాడటం. అంతే ఎదురుతిగిరాడు. సిబ్బందిని, ఏజెంట్లను భయపెడుతున్నానా.. రిగ్గింగ్ చేస్తున్నానా.. ఏమీ చేయటం లేదుకదా నీకెందుకు అన్నాడంట. ఎందుకు ఇలా చల్లాడని ఆరా తీస్తే.. ఇవి మంత్రించిన తెల్లఆవాలు అంట. వీటిని పోలింగ్ బూతుల్లో చల్లితే గెలుపు ఖాయమని ఓ సామి చెప్పాడని.. అందుకే అలా చేశాడని అంటున్నారు. ఈయనగారు అధికార పార్టీ నుంచి బరిలోకి దిగారు.. అతిపెద్ద కుటుంబం అని కూడా చెప్పుకుంటున్నారు. సీమ పౌరుషమే కాదు.. సీమ మంత్రాలు ఎలా పని చేస్తాయో చూడాలి అంటున్నారు జనం. 
Read Also : Be Alert : మీ 2G.. PoS మిషన్స్ Upgrade చేయండి