ఊహించని ట్విస్ట్ : జనసేనలోకి జేడీ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విస్ట్ ఇచ్చారు. ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. లక్ష్మీనారాయణతోపాటు ఆయన తోడల్లుడు, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ రాజగోపాల్ కూడా జనసేనలో చేరనున్నారు.
మార్చి 16వ తేదీ శనివారం రాత్రి విజయవాడలోని జనసేన కార్యాలయానికి వచ్చిన లక్ష్మీనారాయణ.. పవన్ కల్యాణ్‌తో 45 నిమిషాలపాటు చర్చలు జరిపారు. జనసేనలో చేరడం ఖాయమవడంతో… ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.