చాహల్‌ను తిట్టిపోసిన ఇంగ్లాండ్ క్రికెటర్

చాహల్‌ను తిట్టిపోసిన ఇంగ్లాండ్ క్రికెటర్

Updated On : March 30, 2019 / 10:31 AM IST

ఐపీఎల్‌‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ముంబై ఇండియన్స్‌ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో అలరించాడు. క్రీజులో ఉన్న కాసేపటిలోనే ఆర్సీబీ బౌలర్లకు.. ముఖ్యంగా చాహల్‌కు చెమటలు పట్టించాడు. మ్యాచ్‌ అనంతరం చాహల్‌ ఈ విషయంపై మాట్లాడాడు.

‘యువీ నా బౌలింగ్‌లో వరుసగా 3 సిక్సర్లు కొట్టిన తర్వాత స్టువర్ట్‌ బ్రాడ్‌లా ఫీలయ్యాను. యువీ ఓ లెజండరీ బ్యాట్స్‌మన్‌ అని తెలుసు. పైగా చిన్న స్టేడియంలో బంతిని సులభంగా బౌండరీ దాటించవచ్చు. అయినప్పటికీ నా వరకు బాగానే బౌలింగ్‌ చేశానని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్.. చాహల్‌ తనతో పోల్చుకోవడాన్ని గురించి స్పందించాడు. 

‘పదేళ్లలో 437 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా చాహల్‌ ఫీల్‌ అవ్వాలని ఆశిస్తున్నా’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా కౌంటర్ విసిరాడు. గురువారం నాటి మ్యాచ్‌ల్లో 14 వ ఓవర్లో చాహల్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లతో అలరించిన యువీ.. నాల్గో బంతికి సైతం భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. బౌండరీ లైన్‌ వద్ద సిరాజ్‌ క్యాచ్‌ పట్టడంతో యువరాజ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 

శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.