ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసిన చంద్రబాబు : వైసీపీ అనుమానం

ఏపీ సీఎం చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈవీఎంలపై చంద్రబాబు చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం అన్నారు.

  • Published By: veegamteam ,Published On : April 13, 2019 / 07:46 AM IST
ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసిన చంద్రబాబు : వైసీపీ అనుమానం

Updated On : April 13, 2019 / 7:46 AM IST

ఏపీ సీఎం చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈవీఎంలపై చంద్రబాబు చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం అన్నారు.

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈవీఎంలపై చంద్రబాబు చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం అన్నారు. ఓడిపోతామనే భయంతోనే ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదని చంద్రబాబు అంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 30శాతం ఈవీఎంలు పని చెయ్యలేదని చంద్రబాబు అనడంలో అర్థం లేదన్నారు. చంద్రబాబు ఈసీని బెదిరించడం కరెక్ట్ కాదన్నారు.
Read Also : ఓడిపోతామనే భయంతోనే ప్రేలాపనలు : తలసాని

2014లో టీడీపీకి అనుకూలంగా తీర్పు వచ్చిందని, ఆ రోజు ఉన్నది ఇవే ఈవీఎంలు అని సజ్జల గుర్తు చేశారు. ఆ రోజు చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని మేము అనుకోవాల్సి వస్తుందన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని దేశంలో అనే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది జగన్ కు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. 2014లో చంద్రబాబు సహా రాష్ట్ర మొత్తం సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారని నమ్మారని, కానీ ఓటరు తీర్పు డిఫరెంట్ గా వచ్చిందని, అయిన జగన్ ఒక్క మాట మాట్లాడలేదని, హుందాగా స్వీకరించారని సజ్జల అన్నారు. ఫలితాలు వచ్చిన 10 నిమిషాలకే జగన్ ప్రజల ముందుకు వచ్చి వినమ్రంగా ప్రజాతీర్పుని స్వీకరిస్తున్నట్టు చెప్పారని సజ్జల గుర్తు చేశారు. పరిణితి చెందిన రాజకీయ నేతకు ఉండాల్సిన మొదటి లక్షణం అదే అన్నారు.
Read Also : ఉత్సాహం తగ్గించుకోండి : టిక్ టాక్‌కు ఏజ్ లిమిట్, 60లక్షల వీడియోలు డిలీట్

చంద్రబాబు తీరు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని సజ్జల వాపోయారు. ఒక గుర్తుకి ఓటు వేస్తే మరో గుర్తుకి ఓటు పడుతోందని ఆరోపించడం దారుణం అన్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితిపై ప్రజలకు సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. 80 శాతంమంది ఓటర్లు ఓటు హక్కు వేశారని, వారిలో ఒక్కరు కూడా ఎలాంటి ఫిర్యాదు చెయ్యలేదని సజ్జల అన్నారు. చంద్రబాబు తన ఓటు సైకిల్ గుర్తుకే వేసి ఉంటాడని అనుకుంటున్నామని అన్నారు.

లేదంటే పొరపాటున ఫ్యాన్ కి ఓటేసిన చంద్రబాబు.. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనే సందేహం కలుగుతోందన్నారు. ఒక గుర్తుకి నొక్కితే మరో గుర్తుకి పడుతోందని.. ఓటు వేసిన బయటకు వచ్చిన వెంటనే చంద్రబాబు ఫిర్యాదు చేసి ఉంటే అందరికి నమ్మకం కలిగేదన్నారు. కంప్యూటర్ పితామహుడిని నేనే అని చెప్పుకునే బాబు.. ఇప్పుడిలా ఈవీఎంలపై అనుమానం పడటం అవివేకం అన్నారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే.. ఆయనకు ఏదైనా ఉండి ఉండాలి, లేదంటే ఓడిపోతామని తెలిసి ఈవీఎంలపై నెపం నెడుతున్నారని సజ్జల అన్నారు.
Read Also : నువ్వొద్దమ్మా : తల్లిని ఇంటి నుంచి వెళ్లగొట్టిన నటి సంగీత