చిత్తూరు జిల్లాలో 8 సీట్లు ఖరారు : ఆ రెండే టార్గెట్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత జిల్లా అయినప్పటికీ.. వైఎస్ఆర్ అధినేత జగన్‌కు సొంత జిల్లా అయిన కడపలో ఉన్నంత పట్టు టీడపీకి  చిత్తూరు జిల్లాలో లేదు.

  • Published By: vamsi ,Published On : March 15, 2019 / 07:02 AM IST
చిత్తూరు జిల్లాలో 8 సీట్లు ఖరారు : ఆ రెండే టార్గెట్

Updated On : March 15, 2019 / 7:02 AM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత జిల్లా అయినప్పటికీ.. వైఎస్ఆర్ అధినేత జగన్‌కు సొంత జిల్లా అయిన కడపలో ఉన్నంత పట్టు టీడపీకి  చిత్తూరు జిల్లాలో లేదు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత జిల్లా అయినప్పటికీ.. వైఎస్ఆర్ అధినేత జగన్‌కు సొంత జిల్లా అయిన కడపలో ఉన్నంత పట్టు టీడపీకి  చిత్తూరు జిల్లాలో లేదు. అయితే ఈసారి చిత్తూరు జిల్లాలో పట్టు సాధించాలని భావిస్తున్న చంద్రబాబు అసంతృప్తులను బుజ్జగిస్తూ.. అభ్యర్ధులను బరిలో దింపుతున్నారు. అంతేకాదు జిల్లాలో కొందరు నాయకులను ఓడించాలని గట్టి టార్గెట్ పెట్టుకున్న చంద్రబాబు.. మిషన్ 150 ప్లస్ లక్ష్యంలో భాగంగా ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
Read Also: నిలువునా దోచేస్తున్నారు : బుక్‌ మై షో, పీవీఆర్ చీటింగ్‌ బట్టబయలు

చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా కుప్పం, పలమనేరు, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి, పీలేరు, నగరి నియోజకవర్గ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసి ప్రకటించారు. జిల్లాలో టీడీపీకి కొరకరాని కొయ్యగా ఉన్న రెండు నియోజకవర్గాలు నగరి, చంద్రగిరిలలో వైసీపీని ఓడించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రెండు నియోజకవర్గాలకు గాలి ముద్దు కృష్ణమనాయుడు కొడుకు గాలి భానుప్రకాశ్‌ని నగరికి, పులవర్తి నానిని చంద్రగిరికి ఖరారు చేశారు.  చిత్తూరు, మదనపల్లె, పూతలపట్టు, సత్యవేడు, తంబళ్లపల్లి, గంగాధర నెల్లూరు స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయలేదు.

చిత్తూరులో మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్, గంగాధర నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ఆర్‌.గాంధీ, తిరుపతిలో మబ్బు నారాయణరెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరారు. తటస్థంగా ఉన్న సైకం జయచంద్రారెడ్డికి పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌ పదివిని కేటాయించడంతో ఆయన కీలకంగా మారారు. పూతలపట్టు నియోజకవర్గంలో బీజేపీ నుంచి బంగ్లా ఆర్ముగం సైకిలెక్కారు. చంద్రగిరి నియోజవర్గంలో గత రెండు నెలల నుంచి పలువురు నాయకులు కార్యకర్తలు అధికార పార్టీలో చేరారు. దీంతో జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. గంగాధర నెల్లూరు, సత్యవేడు, తంబళ్లపల్లి, మదనపల్లి, పూతలపట్టు, నగరి నియోజకవర్గాల అభ్యర్థులపై కసరత్తు జరుగుతుంది.
Read Also: ప్రకాశం టీడీపీ రేసుగుర్రాలు వీళ్లే.. బాలకృష్ణ కారణంగా పూర్తిగా రాని క్లారిటీ!

సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 
ఓసీలు- 07
బీసీలు-01

చిత్తూరు జిల్లా తెలుగుదేశం అభ్యర్ధులు:
పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
పుంగనూరు – ఎన్‌.అనూష రెడ్డి
చంద్రగిరి – పులవర్తి నాని 
తిరుపతి – ఎం.సుగుణమ్మ
శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్ రెడ్డి
నగరి – గాలి భానుప్రకాశ్
పలమనేరు – ఎన్‌.అమర్‌నాథ్ రెడ్డి
కుప్పం – నారా చంద్రబాబు నాయుడు

ఖరారు కాని స్థానాలు:
చిత్తూరు
మదనపల్లె
పూతలపట్టు.
సత్యవేడు.
తంబళ్లపల్లి
గంగాధర నెల్లూరు