సీఎం జగన్ పై నారాయణమూర్తి ప్రశంసలు : ప్రభుత్వ పాలన అద్భుతం
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. వైసీపీ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. వైసీపీ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. వైసీపీ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎవ్వరూ చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం జగన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.
జనాభాలో 54శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని జగన్ ప్రయత్నిస్తుండటం అభినందనీయం అన్నారు. రిజర్వేషన్ల కొరకు అసెంబ్లీలో బిల్లు పెట్టినందుకు జగన్‌కు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.