వారిని బాగా చూసుకోవడం లేదనే మాట రాకూడదు, క్వారంటైన్‌కి సిద్దపడేవారికే ఏపీలోకి అనుమతి

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో శనివారం(మార్చి 28,2020) కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల

  • Published By: veegamteam ,Published On : March 28, 2020 / 11:35 AM IST
వారిని బాగా చూసుకోవడం లేదనే మాట రాకూడదు, క్వారంటైన్‌కి సిద్దపడేవారికే ఏపీలోకి అనుమతి

Updated On : March 28, 2020 / 11:35 AM IST

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో శనివారం(మార్చి 28,2020) కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో శనివారం(మార్చి 28,2020) కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ జవహర్‌ రెడ్డి దీనికి హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లోనే భోజనం, వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వారిని బాగా చూసుకోవడం లేదనే మాట రాకూడదని అధికారులతో చెప్పారు. అలాగే 14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధపడే వారికే ఏపీలోకి అనుమతివ్వాలని సీఎం చెప్పారు. ప్రతి క్వారంటైన్ సెంటర్ లో కచ్చితంగా ఒక అధికారిని నియమించాలన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో కలెక్టర్లతో కూడా అధికారి మాట్లాడాలన్నారు. సరిహద్దుల్లో అందుబాటులో ఉన్న కల్యాణ మండపాలు.. హోటళ్లను గుర్తించి శానిటైజ్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వలస కూలీలు, కార్మికుల స్థితిగతుల పరిశీలన బాధ్యతలు ఐఏఎస్ అధికారికి అప్పగించారు సీఎం జగన్. 

నిత్యవసర వస్తువుల కొనుగోలు సమయం తగ్గింపు:
ఇక నిత్యవసర వస్తువుల కొనుగోలు సమయం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంది. ఈ సమయాన్ని తగ్గించాలని అధికారులు కోరారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలు, వారి సంఖ్యకు తగినట్టుగా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు ఉన్నాయా లేదా చూడాలని సూచించారు. శాస్త్రీయంగా పరిశీలించి మ్యాపింగ్‌ చేయాలన్నారు. ప్రజలకు సరిపడా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు అందుబాటులోకి తెచ్చిన తర్వాతే కొనుగోలు సమయం తగ్గించే ఆలోచన చేయాలన్నారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాతే.. సమయం తగ్గింపుపై నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వాలంటీర్ల సర్వే, ఫలితాల ఆధారంగా తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే డాక్టర్ల సేవలను ఉపయోగించుకోవాలన్నారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు గుర్తించిన వారిని డాక్టర్ దృష్టికి తీసుకెళ్లి వైద్యం అందించేలా చేయాలన్నారు. అలాగే వాలంటీర్లు, ఆశావర్కర్లు, డాక్టర్లు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.

విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేక దృష్టి:
విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్. విదేశాల నుంచి వచ్చిన ప్రతి 10 మందికి ఒక డాక్టర్ ను కేటాయించాలని తెలిపారు. డాక్టర్లు, స్పెషలిస్టులు మధ్య వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించాలని చెప్పారు. టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచడంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ఎవరికి లక్షణాలు కనిపించినా ఐసోలేషన్‌లో పెట్టాలని ఆదేశించారు. వ్యవసాయం, ఆక్వా రంగాల్లో సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. 

కరోనా రోగి వివరాలు వెల్లడించడం చట్టరీత్యా నేరం:
కరోనా వైరస్ రోగి వివరాలు వెల్లడించడం చట్టరీత్యా నేరమని, గోప్యత కలిగిన సమాచారం వెల్లడించడం నిషేధమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా కరోనా వైరస్ రోగి వివరాలు. వైద్య పరీక్షల వివరాలు వెల్లడిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

ఏపీలో 13కి చేరిన కరోనా కేసులు:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఏపీలో శుక్రవారం (మార్చి 27, 2020) మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. విశాఖకు చెందిన ఓ యువకుడికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇటీవలే బర్మింగ్‌హామ్‌ నుంచి అతని కుటుంబం విశాఖ వచ్చింది. కుటుంబసభ్యుల్లో అతనికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన కుటుంబ సభ్యులు ప్రస్తుతం ప్రత్యేక ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు.

గుంటూరులో తొలి కరోనా కాంటాక్ట్ కేసు:
గుంటూరులో తొలి కాంటాక్టు కేసు నమోదైంది. గుంటూరు జిల్లాకు చెందిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ధృవీకరించింది. ఇప్పటికే కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాధిత మహిళ ఏపీలో నమోదైన పదో కరోనా పేషెంట్ భార్యగా గుర్తించారు.

Also Read | ఇండియాలోని అమెరికన్లను తీసుకెళ్లడానికి 3రోజుల్లో స్పెషల్ విమానాలు